భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం

భువనేశ్వర్ : భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. ఒడిషాలో ని బాలాసోర్ నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన లాంగ్ రేంజ్ సబ్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగించారు. సోమవారం ఉదయం 11.44 గంటలకు లాంచ్ కాంప్లెక్స్ నుంచి మిసైల్ ప్రయోగించినట్లు డీఆర్డీవో వర్గాలు ప్రకటించాయి. నిర్భయ్ ప్రయోగం విజయవంతం అయినట్లు రక్షణ నిపుణులు ప్రకటించారు. బెంగుళూరుకు చెందిన ఏరోనాటిక‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ఇక నిర్భయ్ క్షిపణి ప్రత్యేకత […]

భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 15, 2019 | 6:08 PM

భువనేశ్వర్ : భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. ఒడిషాలో ని బాలాసోర్ నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన లాంగ్ రేంజ్ సబ్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగించారు. సోమవారం ఉదయం 11.44 గంటలకు లాంచ్ కాంప్లెక్స్ నుంచి మిసైల్ ప్రయోగించినట్లు డీఆర్డీవో వర్గాలు ప్రకటించాయి. నిర్భయ్ ప్రయోగం విజయవంతం అయినట్లు రక్షణ నిపుణులు ప్రకటించారు. బెంగుళూరుకు చెందిన ఏరోనాటిక‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది.

ఇక నిర్భయ్ క్షిపణి ప్రత్యేకత విషయానికి వస్తే.. ఇది ధ్వ‌ని వేగం క‌న్నా త‌క్కువ వేగంతో ప్ర‌యాణిస్తుంది. వెయ్యి కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ఇది చేధిస్తుంది. ఇది సుదూరం ప్ర‌యాణించే క్షిప‌ణి. అన్ని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో దీన్ని ప్ర‌యోగించే వీలుంటుంది. ఎటువంటి ప్లాట్‌ఫార్మ్ నుంచి అయినా దీన్ని లాంచ్ చేయ‌వ‌చ్చు. దీని టేకాఫ్ కోసం రాకెట్ బూస్ట‌ర్‌ని వినియోగిస్తారు. అయితే ఎత్తుకు వెళ్లిన త‌ర్వాత .. ట‌ర్బోఫ్యాన్ ఇంజిన్ ద్వారా ఇది టార్గెట్‌ను చేరుకుంటుంది.