దూరదర్శన్‌కి ఈసీ నోటీసులు

న్యూఢిల్లి : లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు సమయం కేటాయించే అంశంపై దూరదర్శన్‌‌కి ఎలక్షన్‌ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి బీజేపీకి 160 గంటల సమయాన్ని దూరదర్శన్ కేటాయించింది. కాగా కాంగ్రెస్‌కు ఇందులో సగం సమయాన్ని మాత్రమే కేటాయించింది. జాతీయ ప్రసార మాధ్యమం వివక్ష చూపుతోందని ప్రతిపక్ష పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. అయినప్పటికీ ప్రధాని మోడీ మై భీ చౌకీదార్‌ కార్యక్రమాన్ని దూరదర్శన్ గంటసేపు ప్రసారం చేసింది. దీంతో […]

దూరదర్శన్‌కి ఈసీ నోటీసులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 15, 2019 | 7:02 PM

న్యూఢిల్లి : లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు సమయం కేటాయించే అంశంపై దూరదర్శన్‌‌కి ఎలక్షన్‌ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి బీజేపీకి 160 గంటల సమయాన్ని దూరదర్శన్ కేటాయించింది. కాగా కాంగ్రెస్‌కు ఇందులో సగం సమయాన్ని మాత్రమే కేటాయించింది. జాతీయ ప్రసార మాధ్యమం వివక్ష చూపుతోందని ప్రతిపక్ష పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. అయినప్పటికీ ప్రధాని మోడీ మై భీ చౌకీదార్‌ కార్యక్రమాన్ని దూరదర్శన్ గంటసేపు ప్రసారం చేసింది. దీంతో ఈసీ దూరదర్శన్‌కి నోటీసులు జారీచేసింది.