మాజీ సీఎం కాన్వాయ్‌పై ఎటాక్

శ్రీనగర్ : పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబుబా ముఫ్తీ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని ఓ ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఫ్తీ.. అనంత్‌నాగ్ వెళ్లి అక్కడి నుంచి బిజ్‌బెహ్రాకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కాన్వాయ్‌పై కొంతమంది ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో ఓ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అయితే జరిగిన […]

మాజీ సీఎం కాన్వాయ్‌పై ఎటాక్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 15, 2019 | 5:30 PM

శ్రీనగర్ : పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబుబా ముఫ్తీ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని ఓ ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఫ్తీ.. అనంత్‌నాగ్ వెళ్లి అక్కడి నుంచి బిజ్‌బెహ్రాకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కాన్వాయ్‌పై కొంతమంది ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో ఓ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అయితే జరిగిన ఘటన నుంచి మెహబుబా ముఫ్తీతో పాటు మిగతావారంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం మెహబుబా ముఫ్తీ అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.