#A1Express: సందీప్ కిష‌న్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి…

టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న లేటెస్ట్ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌'. లావ‌ణ్యా త్రిపాఠి హీరోయిన్‌. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను...

#A1Express: సందీప్ కిష‌న్ 'ఏ1 ఎక్స్‌ప్రెస్' క్లైమాక్స్ షూటింగ్ పూర్తి...
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 17, 2020 | 5:13 PM

A1 Express Movie: టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న లేటెస్ట్ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. లావ‌ణ్యా త్రిపాఠి హీరోయిన్‌. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌ర్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషెక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో అమితాస‌క్తి వ్య‌క్త‌మ‌వుతుండ‌గా, త‌న హాకీ స్కిల్స్‌తో సందీప్ కిష‌న్ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల్ని చేస్తున్నారు. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపు పొందిన ఈ చిత్రంలో హిప్ హాప్ తమిళ స్వ‌రాలు కూర్చిన “సింగిల్ కింగులం” సాంగ్ ఇప్ప‌టికే సూప‌ర్ హిట్ట‌యింది.

ఇండియాలోనే అతిపెద్ద‌, ఉత్త‌మ హాకీ స్టేడియం అయిన‌ పంజాబ్‌లోని మొహాలి స్టేడియంలో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ క్లైమాక్స్ సీక్వెన్స్‌ల‌ను పూర్తి చేశారు. భార‌త‌దేశ‌పు టాప్ హాకీ ఫిలిమ్స్ అయిన ‘చ‌క్ దే ఇండియా’, ‘సూర్మ’ షూటింగ్‌ల‌ను జ‌రిపింది ఈ స్టేడియంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్‌లు ఫెంటాస్టిక్‌గా వ‌చ్చాయి. సినిమాకి ఇవి పెద్ద హైలైట్ అవ‌నున్నాయి. ఈ సీక్వెన్స్‌లో న‌టించ‌డం కోసం గ‌త ఆరు నెల‌లుగా హాకీలో శిక్ష‌ణ తీసుకుంటూ వ‌చ్చారు సందీప్ కిష‌న్‌. ఆ ట్రైనింగ్‌కు సంబంధించి ఇటీవ‌ల ఆయ‌న షేర్ చేసిన వీడియోలు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాయి. చిత్రంలో హాకీ ఆడే సీన్ల‌లో ఒక ప్రొఫెష‌న‌ల్ హాకీ ప్లేయ‌ర్ లాగా ఆయ‌న ఆడ‌టం క‌నిపిస్తుంది. ఆ పాత్ర‌కు న్యాయం చేయ‌డం కోసం సందీప్ కిష‌న్ పెట్టిన ఎఫెర్ట్‌కు అభినందించ‌కుండా ఉండ‌లేం.

త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా సందీప్ కిష‌న్ స్పందిస్తూ, “హాకీ ట్రైనింగ్‌లో 6 నెల‌లు.. క్యారెక్ట‌ర్‌లో దాదాపు ఒక ఏడాదిగా ఉండ‌టం.. 14 కిలోల బ‌రువు త‌గ్గ‌డం.. అఫ్‌కోర్స్ కొవిడ్ భ‌యపెడుతుండ‌గానే ఇప్ప‌టిదాకా నేను చేసిన చిత్రాల్లోనే అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కం చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ క్లైమాక్స్‌ ఎట్ట‌కేల‌కు పూర్తి చేశాం. ఇంకొక్క రోజు షూటింగ్ మిగిలుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఫుల్ స్వింగ్‌లో జ‌రుగుతోంది” అని ట్వీట్ చేశారు. చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కు చేరుకున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’, త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..