వచ్చేనెల 27 నుండి గోవాలో సన్‌బర్న్ ఫెస్టివల్ 14 వ ఎడిషన్

అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యూజిక్ లైవ్ సన్‌బర్న్ ఫెస్టివల్ 14 వ ఎడిషన్ ను నిర్వహకులు ప్రకటించారు. గోవాలోని వాగేటర్ వద్ద 2020 డిసెంబర్ 27 నుండి మూడు రోజుల పాటు ప్రత్యక్ష కార్యక్రమాన్ని ప్రదర్శించాలని నిర్ణయించారు.

వచ్చేనెల 27 నుండి గోవాలో సన్‌బర్న్ ఫెస్టివల్ 14 వ ఎడిషన్
Follow us

|

Updated on: Nov 02, 2020 | 7:19 PM

అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యూజిక్ లైవ్ సన్‌బర్న్ ఫెస్టివల్ 14 వ ఎడిషన్ ను నిర్వహకులు ప్రకటించారు. గోవాలోని వాగేటర్ వద్ద 2020 డిసెంబర్ 27 నుండి మూడు రోజుల పాటు ప్రత్యక్ష కార్యక్రమాన్ని ప్రదర్శించాలని నిర్ణయించారు. భారత దేశాన్ని గతకొద్ది నెలలుగా కరోనా మహమ్మారి ముప్పుతిప్పలు పెడుతుంది. దేశవ్యాప్తంగా మార్చి 2020 నుండి కఠినమైన లాక్ డౌన్ చర్యలను చేపట్టింది ప్రభుత్వం. ఏడు నెలల విరామం తర్వాత అన్‌లాక్ విధానాలను ప్రారంభించింది కేంద్రం. ప్రత్యేకంగా అన్ లాక్ 5 మార్గదర్శకాల్లో భాగంగా గ్రౌండ్ ఈవెంట్‌లను అనుమతించింది. దీంతో బహిరంగ ఉత్సవాలను ప్రారంభించడానికి ఇది సరియైన సమయంగా భావించి పర్సెప్ట్ లైవ్ ఏర్పాటు చేస్తున్నామని సన్‌బర్న్ ఫెస్టివల్ నిర్వహకులు కరణ్ సింగ్ అన్నారు. సన్‌బర్న్ గోవా 2020 పరిమిత సంఖ్యలో ఔత్సాహికులను ఆహ్వానిస్తున్నామన్నారు. కొవిడ్ నిబంధనల్లో భాగంగా ​​ప్రపంచ ఉత్తమ పద్ధతులు వర్తించే అన్ని మార్గదర్శకాలను అనుసరించే సూపర్ సేఫ్ ఈవెంట్ నిర్వహించబోతున్నామన్నారు. అభిమానుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నమని కరణ్ సింగ్ తెలిపారు. సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వ, డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్స్ నిబంధనలకు అనుగుణంగా ఈవెంట్ ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా, ఈవెంట్ లో వేదికలోకి ప్రవేశించడానికి అతిథులందరూ స్కానింగ్ నిర్వహిస్తామని, ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా సమర్పించాలి ఉంటుందని సింగ్ పేర్కొన్నారు.

కొవిడ్ -19 కారణంగా పరిమిత సంఖ్యలో అభిమనులు హాజరవుతున్నందున, విస్తృత అభిమానుల సంఖ్యను చేరుకోవాలనే లక్ష్యంతో, గోవాలోని సన్‌బర్న్ ఫెస్టివల్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌తో సహా సన్‌బర్న్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులు వాగేటర్‌లోని ప్రత్యక్ష ‘సన్‌బర్న్ ఫెస్టివల్‌’కి హాజరు కావడానికి ఎంచుకోవచ్చు