Andhra Pradesh: ఒరేయ్ మీరు విద్యార్థులా.. ఉన్మాదులా..? టీచర్‌ను క్లాస్ రూమ్‌లోనే..

జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా.. వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది.. విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులను జ్ఞాన మార్గం వైపు నడిపిస్తారు. శిక్షణతో మెరుగులద్ది ఉన్నత స్థాయికి చేర్చిన మహోన్నతమైన వ్యక్తులుగా ఉపాధ్యాయులు చిరస్థాయిగా నిలుస్తారు..

Andhra Pradesh: ఒరేయ్ మీరు విద్యార్థులా.. ఉన్మాదులా..? టీచర్‌ను క్లాస్ రూమ్‌లోనే..
Crime News
Follow us
Sudhir Chappidi

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 04, 2024 | 9:27 PM

జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా.. వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది.. విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులను జ్ఞాన మార్గం వైపు నడిపిస్తారు. శిక్షణతో మెరుగులద్ది ఉన్నత స్థాయికి చేర్చిన మహోన్నతమైన వ్యక్తులుగా ఉపాధ్యాయులు చిరస్థాయిగా నిలుస్తారు.. అందుకే.. గురువులు, శిష్యుల మధ్య బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు.. అయితే.. ఒకప్పుడు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడానికి వస్తున్నారంటే అంటే పిల్లలు మౌనంగా కూర్చొని ఉండిపోయేవారు.. పిన్ డ్రాప్ సైలెన్స్‌గా ఉండేవారు.. చీమ చిటుక్కుమన్న వినిపించినంత మౌనంగా విద్యార్థులు పాఠశాల గదులలో కూర్చునేవారు.. కానీ ఇప్పుడు రోజులు మారాయి.. టీచర్ అంటే భయం లేదు.. భక్తి లేదు.. స్కూల్ అంటే అస్సలు గౌరవమే లేదు.. ఇందుకు నిదర్శనం ఈ ఘటన.. అల్లరి చేయొద్దు అని చెప్పిన టీచర్‌ను రొమ్ముల మీద గుద్ధి చంపారంటే విద్యార్థుల పరిస్థితి ఏంటో.. వారి మానసిక స్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు..

అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఈ విషాదకర సంఘటన జరిగింది.. రాయచోటి పట్టణంలోని జిల్లా పరిషత్తు ఉర్దూ హై స్కూల్ నందు ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తున్న ఏజాస్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల దాడిలో మృత్యువాత పడ్డాడు.. ఎప్పటిలాగే.. క్లాస్ రూమ్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా ఏజాస్.. ఈ క్రమంలో విద్యార్థులు ఎక్కువగా అల్లరి చేస్తుండడంతో అల్లరి చేయవద్దని వారిని మందలించాడు.

దీంతో తీవ్ర కోపానికి లోనైన విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.. ముగ్గురు విద్యార్థులు ఉపాధ్యాయుడిపై దాడి చేశారు.. ఈ క్రమంలో ఏజాస్ ఛాతీ మీద గట్టిగా కొట్టారు.. దీంతో ఏజాస్ ఒక్కసారిగా క్లాస్ రూమ్ లో సొమ్మసిల్లి పడిపోయాడు. ఉపాధ్యాయుడు పరిస్థితిని చూసిన తోటి ఉపాధ్యాయులు వెంటనే ఏజాస్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. వైద్యులు వైద్యం చేస్తుండగా ప్రాణాలు విడిచాడు.. అయితే విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు దీనిపై విచారణ చేపట్టారు.

ఒకప్పుడు రోజులు కాదు.. రోజులు మారాయి… విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేది పోయి ఉపాధ్యాయులకే విద్యార్థులు నీతి బుద్ధులు నేర్పే లాగా తయారవుతున్నారంటూ ఈ ఘటనపై స్థానికులు ఫైర్ అవుతున్నారు.. దీనిపై విద్యాశాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని చనిపోయిన ఉపాధ్యాయుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కాగా.. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..