సైనికులకు కుచ్చు టోపీ.. మార్కెట్లలో ఫేక్ మెడల్స్ ‘ హవా ‘ !

సైన్యంలో తాము చేసిన సేవలకు మెడల్స్ పొందాలనుకుంటున్న జవాన్లకు షాకింగ్ న్యూస్ ఇది ! అసలు మెడల్స్ అందుకోలేని వీరు మార్కెట్లలో సులువుగా లభించే నకిలీ మెడల్స్ చూసి విస్తుపోతున్నారు. కేవలం 250 లేదా 300 రూపాయలు చెల్లిస్తే చాలు.. ఇవి ఈజీగా దొరుకుతున్నాయి. దర్శన్ సింగ్ ధిల్లాన్ అనే మాజీ సైనికుడు స్వయంగా తనకు కలిగిన అనుభవాన్ని వివరిస్తూ. తనకు సర్వీసులో ఉండగా ‘ సామాన్య సేవా మెడల్ ‘ లభించిందని, కానీ.. ఇదే పేరిట […]

సైనికులకు కుచ్చు టోపీ.. మార్కెట్లలో ఫేక్ మెడల్స్ ' హవా ' !
Follow us
Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Dec 23, 2019 | 3:10 PM

సైన్యంలో తాము చేసిన సేవలకు మెడల్స్ పొందాలనుకుంటున్న జవాన్లకు షాకింగ్ న్యూస్ ఇది ! అసలు మెడల్స్ అందుకోలేని వీరు మార్కెట్లలో సులువుగా లభించే నకిలీ మెడల్స్ చూసి విస్తుపోతున్నారు. కేవలం 250 లేదా 300 రూపాయలు చెల్లిస్తే చాలు.. ఇవి ఈజీగా దొరుకుతున్నాయి. దర్శన్ సింగ్ ధిల్లాన్ అనే మాజీ సైనికుడు స్వయంగా తనకు కలిగిన అనుభవాన్ని వివరిస్తూ. తనకు సర్వీసులో ఉండగా ‘ సామాన్య సేవా మెడల్ ‘ లభించిందని, కానీ.. ఇదే పేరిట ఢిల్లీ మార్కెట్లో ఇలాంటివి ఏడు మెడల్స్ చూసి ఆశ్ఛర్యపోయానని అంటున్నాడు. అసలైన పతకం బరువుగా, ఆకర్షణీయంగా ఉంటే.. ఫేక్ మెడల్స్ నాసిరకం లోహంతోనో, ప్లాస్టిక్ తోనో తయారైనవిగా ఉంటున్నాయని 59 ఏళ్ళ ఈ మాజీ జవాన్ చెబుతున్నాడు.

ఈ ఫేక్ మెడల్స్ ధరించి సర్వీసులో నేను చాలా కాలం పాటు కొనసాగాను.. అయితే ఎవరూ గుర్తు పట్టలేదు అని దర్శన్ సింగ్ తెలిపాడు. అనారోగ్య కారణాలతో తాను ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నానని చెబుతున్న ఈయన..తనలాగా మెడల్స్ కోసం ఎంతమంది సైనికులు వేచి ఉన్నారో తెలుసుకునేందుకు ఆర్ టీ ఐ చట్టం కింద దరఖాస్తు పెట్టానని తెలిపాడు. ఏప్రిల్ లో ఆయన ఈ అప్లికేషన్ పెట్టుకోగా.. నాలుగు నెలల తరువాత తనకు అందిన రెస్పాన్స్ చూసి షాక్ తిన్నాడు. సైనిక సిబ్బందికి సంబంధించి ఈ ఏడాది జులై 31 వరకు 17.33 లక్షల సర్వీసు మెడల్స్ ‘ వెయింటింగ్ లిస్ట్ ‘ లో ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖలోని సైనిక ప్రధాన కార్యాలయం నుంచి ఆయనకు సమాధానం వచ్చింది. నిజానికి ప్రతి ఏడాదీ ఈ పతకాల కోసం రక్షణ మంత్రిత్వ శాఖ కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. కాగా-ఫేక్ మెడల్స్ విషయంలో వ్యాఖ్యానించేందుకు సైనికాధికారులు నిరాకరిస్తున్నారు.