హోండురస్‌ జైల్లో ఘర్షణ..18మంది ఖైదీలు మృతి

హోండురస్‌ దేశంలో జైళ్లు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. రెండు గ్రూపులుగా విడిపోయిన ఖైదీలు బీభత్సం సృష్టిస్తున్నారు. తరచూ జరుగుతున్న ఈ ఘర్షణలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హోండురస్‌ క్యాపిటల్‌ టెగుసిగల్పా ఎల్‌ పోర్వనిర్‌ జైల్లో జరిగిన ఘర్షణలో 18 మంది మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో ఖైదీలు తుపాకులు, కత్తులు వాడినట్లు తెలిపారు పోలీసులు. ఖైదీల మధ్య గొడవ ఎందుకు జరిగిందో తమకు తెలియదంటున్నారు అధికారులు. ఇక రెండ్రోజుల క్రితం ఉత్తర టెలా […]

హోండురస్‌ జైల్లో ఘర్షణ..18మంది ఖైదీలు మృతి
Follow us
Anil kumar poka

|

Updated on: Dec 23, 2019 | 2:31 PM

హోండురస్‌ దేశంలో జైళ్లు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. రెండు గ్రూపులుగా విడిపోయిన ఖైదీలు బీభత్సం సృష్టిస్తున్నారు. తరచూ జరుగుతున్న ఈ ఘర్షణలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హోండురస్‌ క్యాపిటల్‌ టెగుసిగల్పా ఎల్‌ పోర్వనిర్‌ జైల్లో జరిగిన ఘర్షణలో 18 మంది మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో ఖైదీలు తుపాకులు, కత్తులు వాడినట్లు తెలిపారు పోలీసులు. ఖైదీల మధ్య గొడవ ఎందుకు జరిగిందో తమకు తెలియదంటున్నారు అధికారులు.

ఇక రెండ్రోజుల క్రితం ఉత్తర టెలా ఓడరేవు పట్టణంలోని జైల్లో కూడా హింస చెలరేగింది. ఈ ఘటనలో 18మంది మృతి చెందగా..16 మంది గాయపడ్డారు. ఇక ఇటీవల ఇదే జైల్లో ఐదుగురిని కాల్చి చంపాడు మరో ఖైదీ. ఇలా వరుస ఘటనలతో జైళ్లలో భద్రత పెంచాలని..మిలట్రీ ఆధీనంలోకి తీసుకోవాలని  ఆదేశించారు అధ్యక్షుడు జువాన్‌ ఓర్లాండో హెర్నాండెజ్‌. హోండురస్‌లోని జైళ్ల సామర్థ్యం కేవలం 8వేలే అయినా ప్రస్తుతం అక్కడ 21వేల మందికి పైగా బందీలుగా ఉన్నారు.