చట్టపరమైన ఆదేశాలను బేఖాతరు చేస్తున్న వాట్సప్..!
వాట్సప్ వంటి పలు ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్స్‌పై ప్రభుత్వం సీరయస్‌గా ఉంది. పలు కేసుల విషయంలో ఈ సోషల్ మీడియా సంస్థలు దర్యాప్తునకు సహకరించడం లేదంటూ.. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను సాకుగా చూపుతూ.. చట్టపరమైన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాల్లో అశ్లీల చిత్రాల వ్యాప్తి, పిల్లలపై వాటి దుష్ప్రభావం వంటి అంశాలను.. మానిటరింగ్ చేసేందుకోసం ఏర్పాటైన రాజ్యసభ కమిటీ ఎదుట.. మినిస్టరీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు […]
వాట్సప్ వంటి పలు ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్స్‌పై ప్రభుత్వం సీరయస్‌గా ఉంది. పలు కేసుల విషయంలో ఈ సోషల్ మీడియా సంస్థలు దర్యాప్తునకు సహకరించడం లేదంటూ.. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను సాకుగా చూపుతూ.. చట్టపరమైన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయన్నారు.
సోషల్ మీడియాల్లో అశ్లీల చిత్రాల వ్యాప్తి, పిల్లలపై వాటి దుష్ప్రభావం వంటి అంశాలను.. మానిటరింగ్ చేసేందుకోసం ఏర్పాటైన రాజ్యసభ కమిటీ ఎదుట.. మినిస్టరీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు ఈ మేరకు నివేదిక సమర్పించారు. అశ్లీల చిత్రాల విషయంలో.. సోషల్ మీడియా వేదికల నుంచి తమశాఖకు చట్టపరంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు.