రైళ్లలో మిడిల్, అప్పర్ బెర్తులు ఎక్కడం ఇక ఈజీ ?

రైలు ప్రయాణికుల సౌకర్యం కోసం కాన్పూర్ లోని ఐఐటీ విభాగం ఓ కొత్త డిజైన్ కి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా రైళ్లలో మిడిల్, అప్పర్ బెర్తులను ఎక్కడం, దిగడంలో మహిళలు, వృధ్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సమస్యను అధిగమించేందుకు కాన్పూర్ ఐఐటీ సంస్థకు చెందిన పీ హెచ్ డీ స్కాలర్లు, ప్రొఫెసర్లు ఓ కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్ ని డెవలప్ చేశారు. వీరు ఈ బెర్తుల స్టెయిర్ డిజైన్ ని మార్చేందుకు యత్నిస్తున్నారు. […]

రైళ్లలో మిడిల్, అప్పర్ బెర్తులు ఎక్కడం ఇక ఈజీ ?
Follow us

|

Updated on: Dec 23, 2019 | 1:47 PM

రైలు ప్రయాణికుల సౌకర్యం కోసం కాన్పూర్ లోని ఐఐటీ విభాగం ఓ కొత్త డిజైన్ కి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా రైళ్లలో మిడిల్, అప్పర్ బెర్తులను ఎక్కడం, దిగడంలో మహిళలు, వృధ్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సమస్యను అధిగమించేందుకు కాన్పూర్ ఐఐటీ సంస్థకు చెందిన పీ హెచ్ డీ స్కాలర్లు, ప్రొఫెసర్లు ఓ కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్ ని డెవలప్ చేశారు. వీరు ఈ బెర్తుల స్టెయిర్ డిజైన్ ని మార్చేందుకు యత్నిస్తున్నారు. ఈ డిజైన్ ని బట్టి.. మిడిల్, అప్పర్ బెర్తుల స్టెయిర్ ని ప్రయాణికులు తమకు అనువుగా మలచుకోవచ్ఛు. అంటే వీటిని ఎక్కేందుకు గానీ, దిగేందుకు గానీ శ్రమ పడవలసిన అవసరం లేదన్న మాట.. ఇదే విషయాన్ని డిజైన్ ప్రోగ్రామ్ లోని కనిష్క బిశ్వాస్ అనే స్కాలర్ వివరిస్తూ.. ఇందులో మూడు స్టెప్స్, లాకింగ్ మెకానిజం కూడా ఉంటాయని, స్టెయిర్స్ లోని లాక్ ని నిలబడిన పొజిషన్లో యాక్సెస్ చేసుకోవడం ద్వారా.. అంటే ఎలా అయినా ఎక్కేందుకు లేదా దిగేందుకు దాన్ని మార్చుకోవడం ద్వారా వెసులుబాటును పొందవచ్చునని పేర్కొన్నారు. తమ పేటెంట్ కి ప్రభుత్వ ఆమోదం లభించిందని, అయితే ఈ టెక్నాలజీని రైళ్లలో ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖను సంప్రదిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇది ప్రపోజల్ దశలో ఉందని చెప్పిన ఆయన.. తమ టెక్నాలజీకి రైల్వే శాఖ ఆమోదం తెలుపవచ్చునన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. కాగా- ఈ టెక్నాలజీకి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చిన పక్షంలో.. ఇందుకు ఏ మేరకు నిధులు అవసరమవుతాయన్న అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది.