ఆ స్లోగన్‌కు నా తల్లే స్ఫూర్తిః సచిన్

సచిన్ టెండూల్కర్.. క్రికెట్ ప్రపంచానికి రారాజు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించినా.. ఇప్పటికీ అతడిని ఆరాధించేవారు కోకొల్లలు. ఈ లెజండరీ బ్యాట్స్‌మెన్ ఎక్కడ కనిపించినా కూడా ఫ్యాన్స్.. ‘సచిన్.. సచిన్’ అంటూ హర్షధ్వానాలు పలుకుతారు.  ఇకపోతే తను బ్యాటింగ్ చేసిన ప్రతీసారి అభిమానులు తన పేరును పలకడం ఎంతో ఇష్టమని మాస్టర్ బ్లాస్టర్ స్పష్టం చేశారు. ఇటీవల ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ […]

ఆ స్లోగన్‌కు నా తల్లే స్ఫూర్తిః సచిన్
Follow us

|

Updated on: Dec 23, 2019 | 4:37 PM

సచిన్ టెండూల్కర్.. క్రికెట్ ప్రపంచానికి రారాజు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించినా.. ఇప్పటికీ అతడిని ఆరాధించేవారు కోకొల్లలు. ఈ లెజండరీ బ్యాట్స్‌మెన్ ఎక్కడ కనిపించినా కూడా ఫ్యాన్స్.. ‘సచిన్.. సచిన్’ అంటూ హర్షధ్వానాలు పలుకుతారు.  ఇకపోతే తను బ్యాటింగ్ చేసిన ప్రతీసారి అభిమానులు తన పేరును పలకడం ఎంతో ఇష్టమని మాస్టర్ బ్లాస్టర్ స్పష్టం చేశారు. ఇటీవల ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గ్రౌండ్‌లోకి వస్తున్నప్పుడల్లా అభిమానులు ‘సచిన్.. సచిన్’ అంటూ నినాదాలు చేస్తుంటారు. అయితే ఈ స్లోగన్స్‌ను మొదట ఫ్యాన్స్ మొదలు పెట్టలేదని.. చిన్నప్పుడు తాను ఆడుకునే రోజుల్లో తన తల్లి ప్రతీసారి ‘సచిన్.. సచిన్’ అంటూ తనను ముందుకు నడిపించేదని ఆయన అన్నారు. స్కూల్ గ్రౌండ్ నుంచి స్టేడియం.. అలా థియేటర్ల వరకు ‘సచిన్ సచిన్’.. అనే స్లోగన్ కంటిన్యూ కావడం చాలా సంతోషంగా ఉందని సచిన్ పేర్కొన్నారు.

‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ చిత్రం నుంచి సచిన్ జీవితాన్ని చూపిస్తూ ఓ పాట‌ను ఏఆర్ రెహమాన్ ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ చిన్నతనంలో తాను ఆడుకునేందుకు వెళ్లిన ప్రతీసారి తిరిగి ఇంటికి పిలిచేందుకు తన తల్లి ‘సచిన్.. సచిన్’ అంటూ అరిచేవారని ఆయన తెలిపారు. ఇలా తన చిన్నతనంలోని ఎన్నో మధుర స్మృతులను సచిన్ ఈ వేదికపై అభిమానులకు షేర్ చేశారు.

Latest Articles