అలా అయితే లాయర్లకు మూడు, అధికారులకు రెండు పెళ్ళిళ్ళు

ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించినట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ఫార్ములా అమల్లోకి వస్తే ఏపీలో న్యాయవాదులంతా మూడు పెళ్ళిళ్ళు, అధికారులంతా రెండు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వస్తుందంటూ వివాదాస్పద కామెంట్ చేశారు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి. హైకోర్టును మూడు ముక్కలు చేసి, మూడు చోట్ల పెడితే.. న్యాయవాదులు మూడు చోట్లకు తిరగాల్సి వస్తుందని, ఒకవైపు అమరావతి, ఇంకోవైపు విశాఖపట్నంలలో అసెంబ్లీ, సచివాలయం పెడితే.. అధికారులు రెండు చోట్ల వుండాల్సి వస్తుందని అన్నారాయన. ఇలాంటి పరిస్థితిలో న్యాయవాదులకు […]

అలా అయితే లాయర్లకు మూడు, అధికారులకు రెండు పెళ్ళిళ్ళు
Follow us

|

Updated on: Dec 23, 2019 | 4:07 PM

ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించినట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ఫార్ములా అమల్లోకి వస్తే ఏపీలో న్యాయవాదులంతా మూడు పెళ్ళిళ్ళు, అధికారులంతా రెండు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వస్తుందంటూ వివాదాస్పద కామెంట్ చేశారు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి. హైకోర్టును మూడు ముక్కలు చేసి, మూడు చోట్ల పెడితే.. న్యాయవాదులు మూడు చోట్లకు తిరగాల్సి వస్తుందని, ఒకవైపు అమరావతి, ఇంకోవైపు విశాఖపట్నంలలో అసెంబ్లీ, సచివాలయం పెడితే.. అధికారులు రెండు చోట్ల వుండాల్సి వస్తుందని అన్నారాయన. ఇలాంటి పరిస్థితిలో న్యాయవాదులకు మూడు పెళ్ళిళ్ళు.. అధికారులకు రెండు పెళ్ళిళ్ళు అవసరం అవుతాయని ఎద్దేవా చేశారాయన.

ఏపీకి మూడు రాజధానులు వుండే అవకాశం వుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పడం.. ఆ మర్నాడే సీఎం చెప్పిన కోణంలోనే బి.ఎన్.రావు కమిటీ రాజధానులపై నివేదిక ఇవ్వడం.. ఇదంతా చూస్తున్న వారికి ఏపీకి మూడు రాజధానులుగా అమరావతి, విశాఖ, కర్నూలు ఖాయమని తెలిసిపోయింది. ఆ తర్వాత అమరావతిలో రైతుల ఆందోళన ప్రారంభం కాగా.. తెలుగుదేశం పార్టీ నేతల సెటైర్లు కూడా జోరందుకున్నాయి.

గంటా, కేఈ, కొండ్రు లాంటి నేతలు చంద్రబాబుకు ఇంబరాసింగ్ కలిగించేలా మాట్లాడుతుంటే.. మరికొందరు నేతలు టీడీపీ పార్టీలైన్‌లో ముఖ్యమంత్రి జగన్‌పై సెటైర్లు విసురుతున్నారు. ఈనేపథ్యంలోనే అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్థసారథి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. మూడు చోట్ల హైకోర్టు బెంచ్ వుంటే.. న్యాయవాదులు మూడు చోట్లా వుండాల్సి వస్తుందని, రెండో చోట్ల అసెంబ్లీ, సెక్రెటేరియట్ వుంటే అధికారులు రెండు చోట్ల కాపురాలుండాల్సి వస్తుందని అన్నారు. మరో అడుగు ముందుకేసి న్యాయవాదులు మూడేసి, అధికారులు రెండేసి పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వుంటుందని చెప్పుకొచ్చారు పార్థసారథి.

ఈ వ్యాఖ్యల నేపథ్యం వ్యంగ్యం, విమర్శ అయినప్పటికీ.. పార్థసారథి వ్యాఖ్యలు ఆయనపై ఎదురుదాడి చేసే ఛాన్స్ అధికార పార్టీ నేతలకు ఆయనే ఇచ్చారని చెప్పుకుంటున్నారు అనంతపురం జిల్లా వాసులు.