నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
సోమవారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.41గంటలకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 157 పాయింట్లు నష్టపోయి 39,294 వద్ద కొనసాగుతోంది. కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో 11,768 వద్ద కొనసాగుతోంది. నిర్మాణ రంగానికి చెందిన షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. ఇక మిగతా రంగాలన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. యస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, విప్రో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, క్యాడిలా హెల్త్‌కేర్, అరబిందో ఫార్మా, ఏషియన్ […]

సోమవారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.41గంటలకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 157 పాయింట్లు నష్టపోయి 39,294 వద్ద కొనసాగుతోంది. కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో 11,768 వద్ద కొనసాగుతోంది.
నిర్మాణ రంగానికి చెందిన షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. ఇక మిగతా రంగాలన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. యస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, విప్రో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, క్యాడిలా హెల్త్‌కేర్, అరబిందో ఫార్మా, ఏషియన్ పెయింట్స్, ఎల్‌అండ్‌టీ, టైటాన్ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎమ్అండ్‌ఎమ్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, వేదాంత, గ్రాసిమ్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.



