కరోనా బారినపడుతున్న ఉపాధ్యాయులు..!
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. పట్టణాలకే పరిమితమైన మహమ్మారి పల్లెపల్లెకు విస్తరిస్తోంది. మాకేం కాదన్న ధీమాతో ఉన్న వర్గాలు సైతం కొవిడ్ బారినపడుతున్నారు. ఇన్నిరోజులు కరోనా వారియర్లపై ప్రభావం చూపిన ఈ రాకాసి తాజాగా టీచర్లపై పంజా విసురుతోంది. తెలంగాణలో ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభమైన రెండు వారాల వ్యవధిలోనే 2,300 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డట్లు అంచనా.

కరోనా ప్రభావంతో విద్యా సంస్థలు పూర్తిగా మూసివేశారు. విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆగస్ట్ 27 నుంచి ఉపాధ్యాయులను స్కూళ్లకు రావాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులను క్లాసులు వినేలా చూడాలని సూచించినప్పటికీ తర్వాత తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి పరిశీలించాలన్న షరతు కూడా విధించింది. ఆ రిపోర్ట్‌ను రోజూ అధికారులకు ఉపాధ్యాయులు చేరవేయాల్సి ఉంటుంది. ఈ విధులు అప్పగించి కొద్దిరోజులకే టీచర్లు కూడా కరోనా బారిన పడుతున్నట్టు నిర్ధారణ అయ్యింది.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,300 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడినట్టు ఓ సర్వేలో తేలింది. ఈ గణంకాలను ఆయా జిల్లాల ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా ధ్రువీకరించారు. వీరిలో దీర్ఘకాల అనారోగ్య సమస్యలున్నవారు, 50 ఏళ్లు పైబడిన వారూ ఉన్నారు. హృద్రోగ, డయాబెటిస్, డయాలసిస్ సమస్యలున్న ఉపాధ్యాయులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. అయితే, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతుండటంతో స్కూళ్లకు వెళ్లకుండా.. విద్యార్థులను ఫోన్లలో మానిటరింగ్ చేసే అవకాశం కల్వించాలని, పర్క్ ఫ్రం హోం ఇవ్వాలని టీచర్లు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. దీంతో తాజాగా కరోనా సోకిన ఉపాధ్యాయుల వివరాలను ప్రభుత్వం సేకరించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా ప్రభుత్వ టీచర్లు కరోనా బారిన పడుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంతో మొరపెట్టుకున్నాయి. దీంతో సర్కార్ టీచర్లకు వర్క్‌ఫ్రంహోం సదుపాయం కల్పించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే టీచర్లకు ఈనెల 20 వరకు వర్క్‌ఫ్రంహోం ఇచ్చినట్లు తెలుస్తోంది.