SBI Offers: ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. గృహ రుణాలపై వడ్డీ రాయితీ.. మార్చి వరకు ప్రాసెసింగ్‌ చార్జీలు రద్దు

SBI Offers: గృహ రుణాల కోసం ఎదురు చూస్తున్న ఖాతాదారులకు దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మార్చి వరకు గృహ రుణాల..

SBI Offers: ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. గృహ రుణాలపై వడ్డీ రాయితీ.. మార్చి వరకు ప్రాసెసింగ్‌ చార్జీలు రద్దు
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Jan 09, 2021 | 10:30 AM

SBI Offers: గృహ రుణాల కోసం ఎదురు చూస్తున్న ఖాతాదారులకు దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మార్చి వరకు గృహ రుణాలపై 30 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు 1శాతానికి సమానం) వరకు వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే అప్పటి వరకు ప్రాసెసింగ్‌ ఫీజును కూడా రద్దు చేసింది. ఈ వడ్డీ రాయితీ దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రూ. 5 కోట్ల వరకు ఉండే గృహ రుణాలకు కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. సిబిల్‌ పరపవతి స్కోరు ఆధారంగా ఈ రాయితీ ఇస్తామని ఎస్‌బీఐ తెలిపింది. అలాగే రూ.30 లక్షల వరకు ఉండే గృహ రుణాలపై 6.80 శాతం, అంతకు మించిన రుణాలపై 6.95 శాతం వడ్డీ వసూలు చేయనున్నట్లు తెలిపింది.

అంతేకాకుండా మహిళలకు ఇచ్చే గృహ రుణాలపై అదనంగా మరో 5 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. రాయితీలను మెరుగు పర్చినందుకు ఎస్బీఐ సంతోషం వ్యక్తం చేసింది. అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుండటంతో ఇళ్ల కొనుగోలుకు మరింత మంది ఆసక్తి చూపుతారని అభిప్రాయపడింది. అలాగే యోనో యాప్‌ ద్వారా దరఖాస్తు చేసినా అదనంగా 5 బేసిస్‌ పాయింట్ల వడ్డీరాయితీ ఇవ్వనుంది. ఇప్పటికే ఎస్‌బీఐ నుంచి హోమ్‌ లోన్‌ తీసుకున్న ఖాతాదారులు యోనో యాప్‌ ద్వారా ప్రీ అప్రూవ్డ్‌ టాప్‌ అప్ హోమ్‌ లోన్లు పొందే అవకాశం ఉంటుంది.

Singareni Jobs: సింగరేణి వివిధ విభాగాల్లో మార్చిలోగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం: సంస్థ సీఎండీ శ్రీధర్‌ వెల్లడి