Krack Movie: ‘క్రాక్‌’ను ఆ స్టార్‌ హీరో రిజెక్ట్‌ చేశాకే… రవితేజ చేతుల్లోకి వెళ్లిందా.? ఇంతకీ ఆ స్టార్‌ హీరో ఎవరు..?

Star Hero Reject Krack Movie:మాస్ మహారాజ రివితేజ హీరోగా శృతీహాసన్‌ హీరోయిన్‌ జోడిగా తెరకెక్కిన చిత్రం 'క్రాక్‌'. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న తరుణంలో..

Krack Movie: 'క్రాక్‌'ను ఆ స్టార్‌ హీరో రిజెక్ట్‌ చేశాకే... రవితేజ చేతుల్లోకి వెళ్లిందా.? ఇంతకీ ఆ స్టార్‌ హీరో ఎవరు..?
Follow us
Narender Vaitla

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 13, 2021 | 9:58 AM

Star Hero Reject Krack Movie: మాస్ మహారాజ రివితేజ హీరోగా శృతీహాసన్‌ హీరోయిన్‌ జోడిగా తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న తరుణంలో రవితేజ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ తర్వాత భారీ విజయాన్ని అందుకున్న తొలి చిత్రంగా ఈ సినిమా సంచలనం సృష్టించింది. పోలీస్‌ పాత్రలో రవితేజ మరోసారి తన నటన విశ్వరూపాన్ని చూపించాడు. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకెళుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజానికి ‘క్రాక్’ సినిమా కథ మొదట ఓ బడా స్టార్‌ హీరో దగ్గరికి వెళ్లిదంట కానీ అతను రిజెక్ట్‌ చేయడంతోనే రవితేజ ఇందులో నటించాడన్నది సదరు వార్త సారంశం. ఇంతకీ ఆ బడా హీరో ఎవరనేగా మీ డౌట్‌. మరెవరో కాదు విక్టరీ వెంకటేష్‌. మొదటగా దర్శకుడు గోపీ చంద్‌ మలినేని ఈ సినిమా కథతో వెంకీని కలిశాడట.. కథ మొత్తం విన్న వెంకీ సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో గోపిచంద్‌.. రవితేజాకు కథ చెప్పడం, మాస్‌ మహా రాజా సినిమాకు ఓకే చెప్పడం, క్రాక్‌ విజయవంతమవడం చకచక జరిగిపోయాయి.

Also Read: Keerthy Suresh : సర్కారు వారిపాట కోసం లుక్ మారుస్తున్న కీర్తిసురేష్.. ఈసారి అలా కనిపించనుందట..!