RR vs SRH : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్

ఐపీఎల్-13లో మరో ఆసక్తికర పోరు జరుగనుంది. రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్ల మధ్య దుబాయ్‌ వేదికగా ఉత్కంఠ పోరు జరుగనుంది. ఇరు జట్లు కూడా ప్లే-ఆఫ్స్‌ బెర్తు కోసం పోటీ పడనున్నాయి. అయితే టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్  సారథి‌ డేవిడ్‌ వార్నర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. హోల్డర్ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఇదే కానుంది. కేన్‌ విలియమ్సన్‌ స్థానంలో హోల్డర్‌ జట్టులోకి తీసుకున్నారు. బసిల్‌ థంపీ స్థానంలో […]

RR vs SRH : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 22, 2020 | 7:26 PM

ఐపీఎల్-13లో మరో ఆసక్తికర పోరు జరుగనుంది. రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్ల మధ్య దుబాయ్‌ వేదికగా ఉత్కంఠ పోరు జరుగనుంది. ఇరు జట్లు కూడా ప్లే-ఆఫ్స్‌ బెర్తు కోసం పోటీ పడనున్నాయి.

అయితే టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్  సారథి‌ డేవిడ్‌ వార్నర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. హోల్డర్ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఇదే కానుంది. కేన్‌ విలియమ్సన్‌ స్థానంలో హోల్డర్‌ జట్టులోకి తీసుకున్నారు. బసిల్‌ థంపీ స్థానంలో షాబాజ్‌ నదీమ్‌ను టీమ్‌లోకి తీసుకొచ్చాడు వార్నర్‌. గత మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా కేన్‌ గాయపడిన విషయం తెలిసిందే.