AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో సాలీడు గూళ్లు ఎక్కువవుతున్నాయా? ఈ సులువైన చిట్కాలతో శాశ్వతంగా చెక్ పెట్టండి!

ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా మూలల్లో, ఫ్యాన్ల వెనుక, లేదా కబోర్డుల పైన సాలీడు గూళ్లు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. వీటి వల్ల ఇల్లు అశుభ్రంగా కనిపించడమే కాకుండా దుమ్ము, ధూళి చేరి అలర్జీలకు కారణమవుతుంది. సాలెపురుగులను ఇంటి నుండి తరిమికొట్టి, గూళ్లు అల్లకుండా చేయడానికి ఇంట్లోనే లభించే కొన్ని సహజమైన వస్తువులతో సులువుగా పరిష్కరించవచ్చు. గూళ్లను అరికట్టడానికి కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు ఇవే:

ఇంట్లో సాలీడు గూళ్లు ఎక్కువవుతున్నాయా? ఈ సులువైన చిట్కాలతో శాశ్వతంగా చెక్ పెట్టండి!
How To Get Rid Of Spider Webs
Jyothi Gadda
|

Updated on: Sep 02, 2026 | 1:57 PM

Share

ఇంటి మూలల్లో, సీలింగ్, ఫర్నిచర్ వెనుక రూపుదిద్దుకునే సాలీడు గూళ్ళు ఇంటి అందాన్ని చెడగొట్టడమే కాకుండా అపరిశుభ్రతకు దారితీస్తాయి. ప్రతిసారీ గూళ్ళను దులిపినా మళ్లీ మళ్లీ సాలెపురుగులు గూళ్ళు అల్లుతుంటాయి. వీటిని నిశ్వాసంగా నివారించడానికి కెమికల్ స్ప్రేల కంటే సహజమైన మార్గాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ ఒకదాన్ని శుభ్రం చేసినా, మరుసటి రోజే మరొకటి కనిపిస్తుంది. దీనివల్ల ఇల్లు మురికిగా కనిపించడమే కాకుండా, కొన్నిసార్లు వ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే, శుభవార్త ఏమిటంటే, కొన్ని సులభమైన ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా, మీరు సాలెగూళ్లను శాశ్వతంగా తొలగించవచ్చు. ప్రముఖ కంటెంట్ క్రియేటర్, రచయిత్రి, గృహ నిర్వాహక నిపుణురాలు అయిన చాంటెల్ మిలా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోలో, మీ ఇంటికి సాలెపురుగులను దూరంగా ఉంచడానికి ఆమె కొన్ని సులభమైన చిట్కాలను పంచుకున్నారు. ఈ పద్ధతులతో, మీరు సాలెపురుగులు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చు.

1. వైట్ వెనిగర్ స్ప్రే – సాలెపురుగులకు తెల్ల వెనిగర్ ఘాటైన వాసన అస్సలు పడదు. సమాన నిష్పత్తిలో నీరు, వైట్ వెనిగర్ కలిపి ఒక స్ప్రే సీసాలో నింపండి. సాలీడు గూళ్లు ఎక్కువగా ఉండే మూలలు, కిటికీలు, దర్వాజాల సందుల్లో ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా స్ప్రే చేయడం వల్ల సాలెపురుగులు ఆ ప్రాంతాల నుండి పారిపోతాయి.

2. ఎసెన్షియల్ ఆయిల్స్ – పెప్పర్‌మింట్ ఆయిల్ లేదా టీట్రీ ఆయిల్, నిమ్మరసం ఘాటు సాలెపురుగులను దరిచేరకుండా చేస్తుంది. కొన్ని చుక్కల పుదీనా నూనెను నీటిలో కలిపి ఇంటి మూలల్లో స్ప్రే చేస్తే సాలీళ్ళు రాకపోవడమే కాకుండా ఇల్లు మంచి సువాసనతో నిండిపోతుంది.

ఇవి కూడా చదవండి

3. రెగ్యులర్ క్లీనింగ్, వేక్యూమింగ్- వారానికి ఒకసారైనా సుదీర్ఘమైన కర్ర లేదా వేక్యూమ్ క్లీనర్ సహాయంతో సీలింగ్, లైట్ల వెనుక, ఫర్నిచర్ కింద ఉండే సాలీడు గూళ్లను పూర్తిగా శుభ్రం చేయాలి. గూళ్లతో పాటు వాటి గ్రుడ్లను కూడా తొలగిస్తే కొత్తగా సాలెపురుగులు రాకుండా ఉంటాయి.

4. వెలుతురు, పరిశుభ్రత- ఇంట్లో అనవసరమైన పాత వస్తువులు, న్యూస్ పేపర్లు లేదా అట్టపెట్టెలను పేర్చి ఉంచకూడదు. చీకటిగా ఉండే నిల్వ ప్రదేశాల్లో సాలెపురుగులు ఎక్కువగా గూళ్ళు అల్లుతాయి. కాబట్టి ఇంట్లోకి ధారాళమైన గాలి, వెలుతురు వచ్చేలా చూడాలి.

5. చిన్న కీటకాల నివారణ- సాలెపురుగులు ఆహారం కోసం ఈగలు, దోమలు, లైట్ వద్ద తిరిగే పురుగులపై ఆధారపడతాయి. రాత్రి వేళల్లో కిటికీల ద్వారా పురుగులు రాకుండా నెట్లు వాడటం, చిన్న కీటకాలను అదుపు చేయడం ద్వారా సాలీళ్ళు గూళ్ళు అల్లే అవకాశాన్ని నివారించవచ్చు.

ఈ చిన్నపాటి జాగ్రత్తలతో కెమికల్స్ వాడకుండానే మీ ఇంటిని సాలీడు గూళ్ల రహితంగా, అందంగా మార్చుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us