AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 ఏళ్లుగా నిండు గర్భం మోస్తున్న మహిళ ? లోపల పెరుగుతున్నది మృత్యువు!

అందంగా, ఆరోగ్యంగా కనిపించడానికి బరువు తగ్గాలనుకోవడం సాధారణ విషయమే. కానీ, కొన్నిసార్లు దానికి చేసే శస్త్రచికిత్సలు తీవ్రమైన కాంప్లికేషన్లకు దారితీస్తాయి. సరిగ్గా ఇలాంటి విచిత్రమైన, దారుణమైన పరిస్థితి యూకే కు చెందిన ఒక మహిళకు ఎదురైంది. బరువు తగ్గేందుకు సర్జరీ చేయించుకున్న ఆమె, ఏకంగా 18 సంవత్సరాల పాటు పుచ్చకాయ పరిమాణంలో ఉన్న భారీ హెర్నియా తో జీవించాల్సి వచ్చింది. అసలేం జరిగింది?పూర్తి వివరాల్లోకి వెళితే..

18 ఏళ్లుగా నిండు గర్భం మోస్తున్న మహిళ ? లోపల పెరుగుతున్నది మృత్యువు!
Weight Loss Surgery Complications
Jyothi Gadda
|

Updated on: Sep 02, 2026 | 12:20 PM

Share

యూకేకు చెందిన ఒక మహిళ 18 సంవత్సరాలుగా పుచ్చకాయ సైజులో ఉన్న భారీ హెర్నియాతో జీవిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సదరు మహిళ దాదాపు 18 ఏళ్ల క్రితం బరువు తగ్గడం కోసం గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకుంది. సర్జరీ తర్వాత ఆమె బరువు తగ్గినప్పటికీ, ఆపరేషన్ చేసిన పొత్తికడుపు భాగంలో కాంప్లికేషన్లు తలెత్తాయి. కండరాలు బలహీనపడటంతో లోపలి అవయవాలు బయటకు నెట్టబడి పెద్ద హెర్నియాగా రూపాంతరం చెందింది. రోజులు గడిచేకొద్దీ అది పెరుగుతూ చివరికి ఒక పెద్ద పుచ్చకాయ సైజుకు చేరుకుంది.

ఈ భారీ హెర్నియా వల్ల ఆమె పొట్ట భాగం విపరీతంగా ముందుకు రావడంతో, చూసేవారందరూ ఆమెను నిండు గర్భవతి అని పొరబడేవారు. దీంతో రోజూ నడవడానికి, కూర్చోవడానికి, సాధారణ పనులు చేసుకోవడానికి కూడా ఆమె తీవ్ర ఇబ్బంది పడింది. బయటకు వెళ్లిన ప్రతిసారీ ప్రజల విచిత్రమైన చూపులు, ప్రశ్నల వల్ల ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి, అవమానానికి గురైంది. ఈ హెర్నియా ఒక జైలులా తయారైందని, దాని నుండి తప్పించుకోవడానికి వీల్లేదని బాధితురాలు చెబుతోంది. కదలడం చాలా కష్టంగా మారింది. 2011 నుండి, ఆమె రోజువారీ పనుల కోసం ఇతరులపైనే ఆధారపడుతోంది. ఆమె ఎప్పుడో ఉద్యోగం మానేసి, ఇప్పుడు యూనివర్సల్ క్రెడిట్‌పై ఆధారపడి జీవిస్తోంది. ఒక కొడుకుకు తల్లిగా, ఈ పరిస్థితి ఆమె కుటుంబానికి చాలా సవాలుగా మారింది.

హెర్నియాను తొలగించడానికి శస్త్రచికిత్స చేయడం అత్యంత ప్రమాదకరమని వైద్యులు భావించారు. ఆమె శరీర తత్వం, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల సర్జరీ చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండటంతో 18 ఏళ్ల పాటు ఆమె దాన్ని తొలగించుకోలేకపోయింది. ఒకానొక సమయంలో ఆమె బరువు 26 స్టోన్‌లకు (సుమారు 165 కిలోగ్రాములు) చేరింది. బీపీ కూడా చాలా ఎక్కువగా ఉండేది. అంత బరువు, సంక్లిష్టమైన హెర్నియాతో, శస్త్రచికిత్స వల్ల మరణించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని చెప్పడంతో ఏళ్ల తరబడి ఆమె ఆ బరువును మోస్తూనే ఉంది. ఇటీవల ఒక నర్సుతో మాట్లాడుతున్న క్రమంలోనే..ఒక ఆశాకిరణం కనిపించింది.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 2025లో ఆమె NHS ద్వారా బరువు తగ్గించే ఇంజెక్షన్లు తీసుకోవడం ప్రారంభించింది. అప్పటి నుండి, అతను 26 స్టోన్‌ల నుండి 22 స్టోన్‌లకు (సుమారు 140 కిలోగ్రాములు) బరువు తగ్గింది. మెరుగైన ఆహారం, కొంత వరకు చేయగలిగన శారీరక శ్రమ కూడా సహాయపడ్డాయి. ఇప్పుడు, ఆమెకు సర్జరీ చేయాలంటే.. ఇంకా BMIని 30 కంటే తక్కువకు బరువు తగ్గించుకోవడమే లక్ష్యం. ఆపరేషన్‌కు ముందు ఆమె ఇంకా సుమారు 10 స్టోన్‌ల బరువు తగ్గాల్సి ఉంది.

అసలు హెర్నియా అంటే ఏమిటి?:

శరీరంలోని కండరాలు లేదా కణజాలం బలహీనపడినప్పుడు, లోపల ఉండే అవయవం ఆ బలహీనమైన భాగం గుండా బయటకు ఉబ్బెత్తుగా రాడాన్ని హెర్నియా అంటారు. సర్జరీల తర్వాత కుట్లు పడిన ప్రదేశాల్లో ఇటువంటి ఇన్సిషనల్ హెర్నియాలు రావడానికి అవకాశాలు ఎక్కువ.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అయ్యో!! చిన్న వయసులోనే పాప మరణం.. కన్నీరుమున్నీరవుతోన్న నటి పూర్ణ
అయ్యో!! చిన్న వయసులోనే పాప మరణం.. కన్నీరుమున్నీరవుతోన్న నటి పూర్ణ
కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. ధర చూస్తే గుండె గుభేల్లే
కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. ధర చూస్తే గుండె గుభేల్లే
అప్పుడు క్రేజీ హీరో.. ఇప్పుడు తోపు విలన్..
అప్పుడు క్రేజీ హీరో.. ఇప్పుడు తోపు విలన్..
నెల్లూరు మినుముల పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే
నెల్లూరు మినుముల పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ ఉంటాడా ?
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ ఉంటాడా ?
కీళ్ల నొప్పులు తగ్గించి.. నిద్రపట్టేలా చేసే వంటకం ఈ కుడుములు
కీళ్ల నొప్పులు తగ్గించి.. నిద్రపట్టేలా చేసే వంటకం ఈ కుడుములు
నీ విలువను నువ్వే నిర్ణయించుకోవాలి.. ఒక రాయి చెప్పిన జీవిత సత్యం!
నీ విలువను నువ్వే నిర్ణయించుకోవాలి.. ఒక రాయి చెప్పిన జీవిత సత్యం!
కిడ్నీలో రాళ్లు కరిగించి, లివర్‌ను క్లీన్ చేసే అద్భుతమైన కూర!
కిడ్నీలో రాళ్లు కరిగించి, లివర్‌ను క్లీన్ చేసే అద్భుతమైన కూర!
100 చదరపు అడుగుల స్థలంలోనే 3 వ్యాపారాలు.. లక్షల్లో లాభం!
100 చదరపు అడుగుల స్థలంలోనే 3 వ్యాపారాలు.. లక్షల్లో లాభం!
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?