AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోకాళ్ల నొప్పులను తరిమికొట్టి, ఎముకలను బలంగా మార్చే మహౌషధం.. ఇంటి పక్కన ఉండే ఈ ఆకులు తింటే చాలు..

మునగకాయలతో పాటు మునగాకులోనూ విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పలు పోషకాలు ఉంటాయి. మునగాకును కూరగా, పొడిగా లేదా ఇతర వంటకాల్లో ఉపయోగించవచ్చు.. మునగాకులోని పోషకాలు పలు సమస్యలను నివారించడంలో ఎంతో సహాయపడతాయి. మునగలోని పోషక విలువలు, ఉపయోగాలు, తీసుకునే విధానం గురించి తెలుసుకోండి.

మోకాళ్ల నొప్పులను తరిమికొట్టి, ఎముకలను బలంగా మార్చే మహౌషధం.. ఇంటి పక్కన ఉండే ఈ ఆకులు తింటే చాలు..
Moringa Benefits
Shaik Madar Saheb
|

Updated on: Sep 02, 2026 | 1:15 PM

Share

దక్షిణ భారత దేశ ప్రజల ఆహారంలో మునగ (డ్రమ్‌స్టిక్) ఒక ముఖ్యమైన కూరగాయ.. అయితే, దీని ప్రయోజనాలు కేవలం కూరగాయకు మాత్రమే పరిమితం కావు. మునగ చెట్టు వేరు నుండి ఆకు వరకు ప్రతి భాగం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది పోషకాలతో నిండిన ఒక బలమైన ఆహార వనరు. మునగకాయలను ఎక్కువగా వాడుతుంటారు.. కానీ మునగాకులో కూడా అపారమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. మునగలో విటమిన్ ఏ, విటమిన్ సిలతో పాటు కాల్షియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తిని మునగకు అందిస్తాయి.

మునగ కొన్ని వందల శారీరక రుగ్మతలను నయం చేయగలదని ఆయుర్వేదంలో చెబుతారు. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు ఇందులో ఉన్నాయి. మునగాకును వంటల్లో పచ్చగా వినియోగించవచ్చు. అంతేకాకుండా, దీనిని కొంచెం నీడలో ఎండబెట్టి పొడి చేసి నిల్వ ఉంచుకోవచ్చు. ఈ విధంగా నిల్వ చేసిన పొడి సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటుంది. విటమిన్ సి తప్ప మిగిలిన పోషకాలు ఎండబెట్టినప్పుడు కూడా నశించవు లేదా తగ్గవు. 100 గ్రాముల మునగాకులో 440 మిల్లీగ్రాముల కాల్షియం, 0.85 మిల్లీగ్రాముల ఇనుము, అధిక బీటా-కెరోటిన్లు ఉంటాయి.

శ్వాస సంబంధిత సమస్యలు..

ఆయుర్వేద వైద్య విధానంలో మునగ కాయలు, ఆకులు, పువ్వులు, కాండం అన్నింటినీ వాటి ఔషధ గుణాల కారణంగా విస్తృతంగా ఉపయోగిస్తారు. మునగలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మీరు తరచుగా జలుబు, జ్వరం వంటి వాటితో బాధపడుతుంటే, డ్రమ్‌స్టిక్ సూప్ తాగడం తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. మునగాకులో ఉండే ఔషధ గుణాలు ఆస్తమా, ముక్కు కారడం, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తాయి. మునగాకు రసం లేదా మునగకాయ గింజలు ఈ సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి.

ఎముకల ఆరోగ్యం..

మునగ ఆకులు, కాయలలో అధిక శాతంలో ఐరన్, విటమిన్లు, కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి, బలానికి బాగా సహాయపడతాయి. అంతేకాకుండా, ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మునగాకు రసాన్ని ప్రతిరోజు లేదా వారంలో రెండుసార్లు తీసుకోవడం వల్ల శరీర అవయవాలకు రక్త సరఫరా మెరుగుపడుతుంది.

మహిళలకు కూడా మునగ నుండి మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వారి దైనందిన ఆహారంలో మునగను చేర్చుకోవడం వల్ల నీరసం, వాంతులు, తల తిరగడం వంటి వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా, ఇది ప్రసవ నొప్పులను సులభతరం చేస్తుంది. ప్రసవానంతర సమస్యలను తగ్గిస్తుంది. ప్రసవం తర్వాత బిడ్డకు సరిపడా పాలు పడాలంటే మునగాకును తరచుగా తింటుండాలి.

ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది..

మునగలో యాంటీ-బ్యాక్టీరియా ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గొంతు ఇన్ఫెక్షన్లు, ఛాతి, చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల మునగ పువ్వులను అనేక రకాల సూపులలో విరివిగా ఉపయోగిస్తారు. ఇవి ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా సహాయపడతాయి. మునగాకులో ఉండే ఔషధ గుణాలు తేనె, కొబ్బరి నీళ్లతో కలిపి తీసుకోవడం వల్ల కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలైన డయేరియా, డైసెంట్రీ, కామెర్లు, కలరా వంటి వాటికి విరుగుడుగా పనిచేస్తాయి.

మునగకాయ మూత్రాన్ని పరిశుభ్రం చేసి, అతి వేడి వలన మూత్రనాళపు మంట, ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. మునగకాయ రసం కీళ్ల నొప్పుల నివారణకు ఎంతగానో దోహదపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, కాల్షియం ఇందుక ప్రధాన కారణం. మునగ పువ్వులు, చిగుర్లు కూరగా వండుకొని తింటే కీళ్ల జబ్బులు రావు.

రక్తహీనత దూరం..

రక్తహీనతతో బాధపడేవారికి మునగ ఎంతో మేలు చేస్తుంది. ఇది హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మునగాకులను ఎండబెట్టి పొడి చేసుకొని సేవిస్తే రక్తపోటు అదుపులో ఉంటుంది. మధుమేహ వ్యాధితో బాధపడేవారు కూడా దీని వలన ఎంతో ప్రయోజనం పొందుతారు. ఎండబెట్టిన మునగాకు పొడిని తేనెతో కలిపి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అధిక బరువు మటాష్..

నెలసరి సక్రమంగా రానివారు, కాల్షియం తగ్గినవారు చిన్న కప్పు పాలకు పెద్ద చెంచా మునగాకు రసం కలిపి రోజూ తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు ఎండబెట్టిన మునగాకు పొడిని తేనెతో కలిపి చెంచా చొప్పున ప్రతిరోజూ భోజనానికి ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మునగాకు రసం, నిమ్మరసం కలిపి ముఖానికి ప్రతిరోజూ ఉదయం రాసుకుంటే వయసుతో వచ్చే మొటిమలు నివారించబడతాయి, చర్మ సౌందర్యం పెరుగుతుంది. మునగ నిజంగానే ఆరోగ్యం, అందం కోసం ఒక అద్భుతమైన సహజ వరం..

అయితే.. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Follow Us
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి
చనిపోయేలోపు స్వర్గాన్ని చూడాలనుకుంటే..పంచ కేదారాలలో పవిత్రమైన
చనిపోయేలోపు స్వర్గాన్ని చూడాలనుకుంటే..పంచ కేదారాలలో పవిత్రమైన
10 సిక్సర్లు, 7 ఫోర్లతో బీభత్సం.. అభిషేకే షాకయ్యాడుగా
10 సిక్సర్లు, 7 ఫోర్లతో బీభత్సం.. అభిషేకే షాకయ్యాడుగా
రోజుకు 5 నిమిషాల పని.. నెలకు 9 లక్షల సంపాదన! చిన్న ఐడియాతో కోట్లు
రోజుకు 5 నిమిషాల పని.. నెలకు 9 లక్షల సంపాదన! చిన్న ఐడియాతో కోట్లు
మీకు తెలుసా.. సమోసాను ఇంగ్లీషులో ఏమంటారు..?
మీకు తెలుసా.. సమోసాను ఇంగ్లీషులో ఏమంటారు..?