AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా.. ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా తీసేయండి..

ప్రెషర్ కుక్కర్ మూత ఇరుక్కుపోయిందా? అయితే పొరపాటున కూడా బలవంతంగా లాగే సాహసం చేయకండి. కుక్కర్ లోపల ఉండే అధిక పీడనం ఒక్కసారిగా బయటకు తన్నితే తీవ్రమైన గాయాలయ్యే ప్రమాదం ఉంది. వంటింట్లో ఉండే చిన్నపాటి వస్తువులతోనే దాన్ని సులభంగా, సురక్షితంగా తెరిచే మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా.. ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా తీసేయండి..
How To Open Stuck Pressure Cooker Lid
Krishna S
|

Updated on: Sep 02, 2026 | 1:18 PM

Share

ఆధునిక వంటింట్లో ప్రెషర్ కుక్కర్ లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. వంటను వేగంగా పూర్తి చేస్తూ, గ్యాస్‌తో పాటు సమయాన్ని ఆదా చేయడంలో కుక్కర్ పాత్ర కీలకం. అయితే తరచుగా ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో కుక్కర్ మూత ఇరుక్కుపోవడం ఒకటి. ఎంత తిప్పినా, లాగినా మూత అస్సలు కదలదు. ఇలాంటప్పుడు చాలామంది కంగారుపడి బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అలా చేయడం అత్యంత ప్రమాదకరం. లోపల ఉన్న వేడి ఆవిరి ఒక్కసారిగా మొహానికి తగలడమే కాకుండా తీవ్రమైన సందర్భాల్లో కుక్కర్ పేలిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. మరి ఇలాంటప్పుడు సురక్షితంగా మూతను ఎలా తీయాలో మహిళలు తప్పక తెలుసుకోవాలి.

పొయ్యి మీద ఉన్నప్పుడు బిగుసుకుపోతే ఏం చేయాలి?

వంట చేసే సమయంలో కుక్కర్ మూత కదలకపోతే ముందుగా వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. కుక్కర్‌ను ఏమాత్రం కదపకుండా, దానిలోని ప్రెషర్ పూర్తిగా దానంతట అదే తగ్గేంతవరకు ప్రశాంతంగా వేచి చూడాలి. లోపల ఇంకా ఆవిరి ఉండగా మూతను బలవంతంగా లాగడం, విజిల్ తీయడానికి ప్రయత్నించడం అస్సలు చేయకూడదు. అలా చేస్తే వేడి ఆవిరి చేతులపై, ముఖంపై పడి తీవ్రమైన గాయాలవుతాయి.

రన్నింగ్ వాటర్ ట్రిక్.. సెకన్లలో ఉపశమనం

ఒత్తిడి పూర్తిగా విడుదలైన తర్వాత కూడా కొన్నిసార్లు వాక్యూమ్ వల్ల మూత బిగుసుకుపోయి తెరుచుకోదు. అటువంటప్పుడు కుక్కర్‌ను జాగ్రత్తగా పట్టుకుని వాష్‌బేసిన్‌లోని ట్యాప్ కింద పెట్టండి. పారే నీటిని మూత అంచులపై పడేలా చేయాలి. చల్లటి నీళ్లు తగలగానే లోపల ఉన్న వాక్యూమ్ ఒత్తిడి తగ్గిపోయి మూత దానంతట అదే లూజ్ అవుతుంది. కుక్కర్ కాస్త వేడిగా ఉన్నప్పుడు పైనుంచి నెమ్మదిగా నీటిని పోస్తున్నట్లయితే.. ముఖాన్ని కుక్కర్‌కు దూరంగా ఉంచడం ముఖ్యం.

ఖాళీ కుక్కర్ మూత జామ్ అయితే నూనె మ్యాజిక్

కొన్నిసార్లు లోపల ఎలాంటి ఆహారం, ప్రెషర్ లేనప్పుడు కూడా ఖాళీ కుక్కర్ మూత రబ్బర్ బిగుతుగా మారి జామ్ అయిపోతుంది. ఇటువంటి సమయంలో మూత అంచుల్లో, రబ్బర్ గాస్కెట్ ఉన్న ప్రాంతంలో కొన్ని చుక్కల వంట నూనె లేదా ఆవనూనె వేయాలి. నూనె వేసిన కాసేపటికి అది లూబ్రికెంట్‌లా పనిచేసి ఇరుక్కున్న అంచులను వదులు చేస్తుంది. ఆ తర్వాత ఎలాంటి బలం ప్రయోగించకుండా మెల్లగా మూతను తిప్పితే చాలా సులభంగా తెరుచుకుంటుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కుక్కర్ మూత ఇరుక్కున్నప్పుడు కత్తులు, స్పూన్లు పెట్టి బలవంతంగా నెట్టడం లాంటి పనులు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు. దీనివల్ల సేఫ్టీ వాల్వ్ పాడయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ మీ ఇంట్లోని కుక్కర్ మూత ప్రతిసారీ ఇలాగే ఇరుక్కుపోతూ ఇబ్బంది పెడుతుంటే.. వెంటనే దాని రబ్బర్ గాస్కెట్, సేఫ్టీ వాల్ మార్పించాలి. సమస్య తీవ్రంగా ఉంటే ఆ కుక్కర్‌ను వాడటం మానేసి రిపేర్ చేయించడం లేదా కొత్తది తీసుకోవడమే ఉత్తమం.

Follow Us
NEET UG MBBS కౌన్సెలింగ్‌ అభ్యర్థులకు కీలక సూచనలు..
NEET UG MBBS కౌన్సెలింగ్‌ అభ్యర్థులకు కీలక సూచనలు..
రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!
రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!
SIR సిత్రాలు.. భారతరత్న సైంటిస్టుకు నోటీసులు! అసలేం జరిగిందంటే?
SIR సిత్రాలు.. భారతరత్న సైంటిస్టుకు నోటీసులు! అసలేం జరిగిందంటే?
దులీప్ ట్రోఫీ 2026 విజేత దక్కించుకునే ప్రైజ్ మనీ ఎంతంటే?
దులీప్ ట్రోఫీ 2026 విజేత దక్కించుకునే ప్రైజ్ మనీ ఎంతంటే?
ఇకపై ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు పండుగే..
ఇకపై ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు పండుగే..
గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!
గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!
టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం
టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం
పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే
పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే
డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..
డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..
త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా?
త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా?