రేపు ప్రత్యేక ఎంసెట్‌ పరీక్ష..

కరోనా కారణంగా ఎంసెట్ ప్రవేశ పరీక్షకు హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు  గురవారంనాడు ప్రత్యేక ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌) నిర్వహిస్తున్నారు. పరీక్షకు సంబంధించి  ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 8న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు..

రేపు ప్రత్యేక ఎంసెట్‌ పరీక్ష..
Sanjay Kasula

|

Oct 07, 2020 | 6:26 AM

Special Eamcet  : కరోనా కారణంగా ఎంసెట్ ప్రవేశ పరీక్షకు హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు  గురవారంనాడు ప్రత్యేక ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌) నిర్వహిస్తున్నారు. పరీక్షకు సంబంధించి  ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 8న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎల్బీనగర్‌లోని ఐవోఎన్‌ డిజిటల్‌ ఐడీజెడ్‌లో పరీక్షలు నిర్వహిస్తామని కన్వీనర్‌ గోవర్థన్‌ తెలిపారు.

అభ్యర్థులు మధ్యాహ్నం 12.30 కల్లా సెంటర్లకు చేరుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు ధ్రువీకరించే రిపోర్టులతోపాటు ఆ తర్వాత నెగెటివ్‌ రిపోర్టులను సమర్పించాలని సూచించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu