మంజీరా నదికి స్పీకర్ పోచారం పూజలు
మంజీరా నదికి తెలంగాణశాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడం...

మంజీరా నదికి తెలంగాణశాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడం సంతోషమని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టు నిండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పోచారం అన్నారు.
ప్రాజెక్టు లోని నీరు నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు రెండు పంటలకు సరిపోయేంత వరకు అందుతుందని అన్నారు. రైతులు రెండో పంటకు సిద్ధం కావాలని, రైతుల కోరిక మేరకు ఎప్పుడూ నీళ్లు అడిగిన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పీకర్ పోచారం స్పష్టం చేశారు.
నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి, మంజీరా నదికి హారతి ఇచ్చి పూజలు చేసిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు. #NizamSagarProject pic.twitter.com/75Af8ox249
— Pocharam Srinivas Reddy (@PSRTRS) October 16, 2020
ఈ సందర్బంగా జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా జెడ్పి చైర్మన్ శ్రీమతి ధఫేదార్ శోభా రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయారు.