పదో విడత సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేసిన ఆర్‌బీఐ.. గ్రాము బంగారం ధ‌ర రూ. 5,104 గా నిర్ణయం

ప‌దో ద‌శ‌ సావరిన్ ప‌స‌డి బాండ్ల జారీ ప్రక్రియ ప్రారంభించి ఆర్‌బీఐ.

పదో విడత సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేసిన ఆర్‌బీఐ.. గ్రాము బంగారం ధ‌ర రూ. 5,104 గా నిర్ణయం
Follow us

|

Updated on: Jan 11, 2021 | 1:13 PM

Sovereign Gold Bonds Open : ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరంలో ప‌దో ద‌శ‌ సావరిన్ ప‌స‌డి బాండ్ల జారీ ప్రారంభ‌మైంది. ఈ ఇష్యూ జనవరి 15న‌ శుక్రవారంతో ముగియనుంది. గ్రాము బంగారం ధ‌ర రూ. 5,104 గా నిర్ణయించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఆన్‌లైన్‌లో గోల్డ్ కొనుగోలు చేసే వినియోగదారులకు గ్రాముకి రూ. 50 ప్రత్యేక తగ్గింపు ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే రిటైల్ పెట్టుబ‌డుదారుల‌కు ఇది ఉత్తమమైన మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిలో రెండుర‌కాల ప్రయోజ‌నాలు ఉన్నాయని చెబతున్నారు. పెట్టుబడిదారులు తమ పెట్టుబడిపై సంవత్సరానికి 2.5% స్థిర వడ్డీని పొందడంతో పాటు, బంగారం ధ‌ర పెరిగితే ఆ లాభాన్ని కూడా పొంద‌వ‌చ్చంటున్నారు.

ఇటీవల 2020 డిసెంబర్ 28 నుంచి 2021 జనవరి 1 వరకు జారీచేసిన‌ బాండ్ల (సిరీస్ IX) ఇష్యూ ధర గ్రాము బంగారానికి రూ. 5,000. ఈ సావరిన్ బంగారు బాండ్లను భారత ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ జారీ చేస్తుంది. 2019, 2020 సంవత్సరాల్లో బంగారం గ‌ణ‌నీయ‌మైన‌ లాభాలను సాధించింది. రెండంకెల వృద్ధిని న‌మోదుచేసింది. గత ఏడాది ఆగస్టులో బంగారం 10 గ్రాములకు రూ.56,200 వ‌ద్దకు చేరింది. కొంతకాలంగా రూ. 48,000 నుంచి 52,000 పరిధిలో ట్రేడవుతోంది.

ఇదిలావుంటే, అమెరికా డాల‌ర్‌ బలోపేతం, అధిక బాండ్ల దిగుబడి కారణంగా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు బంగారాన్ని ఖరీదైనదిగా మారింది. అమెరికాలో పాలన మార్పులు, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, క‌రోనా టీకా ప్రక్రియ సమర్థత బంగారం ధరలకు మార్గనిర్దేశం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.

హైదరాబాద్ మహానగరానికి మరో అంతర్జాతీయ సంస్థ.. భారీ పెట్టుబడితో గ్లోబ‌ల్ కేప‌బిలిటీ సెంట‌ర్‌

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు