హైదరాబాద్ మహానగరానికి మరో అంతర్జాతీయ సంస్థ.. భారీ పెట్టుబడితో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది అమెరికాకు చెందిన మాస్ మ్యూచువల్ సంస్థ.

US Based mass mutual company : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. మరో అతిపెద్ద గ్లోబల్ కంపెనీ హైదరాబాద్‌కు రాబోతుంది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులతో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ.రామారావు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్, ఫియట్ క్రిస్లర్ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీల సరసన తాజాగా మరో అంతర్జాతీయ కంపెనీ వచ్చి చేరింది.
హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది అమెరికాకు చెందిన మాస్ మ్యూచువల్ సంస్థ. నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అమెరికా వెలుపల రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగానే మాస్ మ్యూచువల్ తరుపున హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడంతో రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ఇదే విషయానికి సంబంధించి మంత్రి కేటీఆర్ ట్వీట్ వేదికగా షేర్ చేశారు. ఈ వారానికి ఇంతకు మించిన శుభారంభం ఏముంటుంది? టాప్ ఫార్చున్ 500 కంపెనీల్లో ఒకటైన మాస్ మ్యూచువల్‌ను రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంచాలా సంతోషంగా ఉందని కేటీఆర్ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.
What better way to start the week than to welcome a top Fortune-500 company
Delighted to announce that BFSI major US based @massmutual is setting up their Global Capability Center in Hyderabad, Telangana
This is their first center outside US with initial investment of ₹1000 Cr pic.twitter.com/ziCR36sIvv
— KTR (@KTRTRS) January 11, 2021
Read Also…. నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న ప్రధాని మోదీ.. 6.47 కోట్ల మంది ట్విట్టర్ ఫాలోవర్లతో మొదటి స్థానం