అడిగిన వెంటనే ఉద్యోగం.. దటీజ్ సోను సూద్
హైదరాబాద్‌కు చెందిన ఓ టెక్కీ శారదకు ఓ బిగ్ హాండ్ లభించింది. ఉద్యోగం కోల్పోయి కూరగాయలు విక్రయించుకుంటున్న శారదకు సోను సూద్ సోమవారం ఆమెకు జాబ్ ఆఫర్ లెటర్‌ను..
Sonu Sood offers job to Hyderabad techie : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలించేస్తోంది. కొందరి వ్యాపారాలు కరోనా గాలికి ఎగిరిపోతే.. మరికొందరికి ఉపాధి కనిపించకుండా పోయింది. అయితే కొవిడ్ సృష్టించిన సంక్షోభం నుంచి కొందరు ఉపాధిని వెతుకుని విజయం కోసం పోరాడుతున్నారు. వారు చేస్తున్న అలుపెరగని పోరాటం విజయం వైపు పరుగులు తీస్తోంది. ఇలాంటి విజయాన్ని అందుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ టెక్కీ శారదకు ఓ బిగ్ హాండ్ లభించింది. ఉద్యోగం కోల్పోయి కూరగాయలు విక్రయించుకుంటున్న శారదకు సోను సూద్ సోమవారం ఆమెకు జాబ్ ఆఫర్ లెటర్‌ను అందించారు.
కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ఆమె కుటుంబం గడవడానికి కూరగాయలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సంగతిని.. రిట్చీ షెల్సన్ అనే నెటిజన్ ట్విట్టర్ వేదికగా సోనూసూద్‌ను అభ్యర్థించారు.
“డియర్ సోను సూద్ సార్.. హైదరాబాద్‌కు చెందిన శారదా కరోనా కారణంగా తన ఉద్యోగం కోల్పోయింది. ఆమె తన కుటుంబం కోసం కూరగాయలు విక్రయిస్తోంది. దయచేసి మీరు ఆమెకు ఏమైనా సపోర్ట్ ఇవ్వగలరా?” అని ట్వీట్ చేస్తూ సోను సూద్ కు ట్యాగ్ చేశారు.
వెంటనే స్పందించిన సోను సూద్ తన అధికారి ఆమెను కలిశారని. ఆమెకు ఉద్యోగ నియామక లేఖ కూడా అందిందని ఆయన ట్వీట్ చేశారు. ఇదే అంశంపై టెక్కీ శారదా స్పందించారు. సోను సూద్ నుంచి తనకు సహాయం అందిందని అన్నారు.
My official met her.
Interview done.
Job letter already sent.
Jai hind ??? @PravasiRojgar https://t.co/tqbAwXAcYt
— sonu sood (@SonuSood) July 27, 2020