AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం ముందు జగన్ భారీ డిమాండ్.. దూతగా విజయసాయి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్ళి మరీ సడన్‌గా తిరిగి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ముందు భారీ డిమాండ్‌ను పెట్టారు. అది నేరుగా తాను కాకుండా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ద్వారా సందేశాన్ని కాస్త గట్టిగానే వినిపించారు వైఎస్ జగన్. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం, పునరావాస, పునఃనిర్మాణ పనుల కోసం తక్షణమే 16 వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని […]

కేంద్రం ముందు జగన్ భారీ డిమాండ్.. దూతగా విజయసాయి
Rajesh Sharma
|

Updated on: Dec 10, 2019 | 6:47 PM

Share

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్ళి మరీ సడన్‌గా తిరిగి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ముందు భారీ డిమాండ్‌ను పెట్టారు. అది నేరుగా తాను కాకుండా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ద్వారా సందేశాన్ని కాస్త గట్టిగానే వినిపించారు వైఎస్ జగన్.

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం, పునరావాస, పునఃనిర్మాణ పనుల కోసం తక్షణమే 16 వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని కేంద్రాన్ని కోరింది ఏపీ సర్కార్. నీటి సంక్షోభం నివారణ కోసం జాతీయ ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన ఆవశ్యకతపై మంగళవారం రాజ్యసభలో కాలింగ్‌ అటెన్షన్‌ మోషన్‌పై జరిగిన చర్చలో విజయసాయి మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించి.. తక్షణం కేంద్రసాయం అవసరమని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం ముంపునకు గురయ్యే గ్రామాల నుంచి వేలాది మంది రైతులు, దళితులు, గిరిజనుల కుటుంబాలను ఖాళీ చేయించడం జరిగిందని అన్నారు. ప్రాజెక్ట్‌ నిర్వాసితులైన వారందరికి పునరావాసం కల్పించాలి. పునఃనిర్మాణ కార్యకలాపాలు చేపట్టాలి. ఇందుకోసం 16 వేల కోట్ల రూపాయలు తక్షణం అవసరం. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనా వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడానికి ముందుగా ఈ 16 వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయమని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అక్టోబర్‌ 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఎప్పటిలోగా ఈ నిధులను విడుదల చేస్తారో తెలపవలసిందిగా జల శక్తి మంత్రిని కోరారు.

పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన అంచనా వ్యయంతో రూపొందించిన డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం ఆమోదించింది. తదుపరి డీపీఆర్‌ను ఆమోదం కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించింది. దీనిపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేసేందుకు మంత్రిత్వ శాఖ రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికి మూడు, నాలుగుసార్లు సమావేశమైంది. అసలు ఈ కమిటీకి నిర్దేశించిన విధి విధానాలేమిటి, నివేదిక సమర్పించడానికి విధించిన కాల పరిమితి ఎంత, ఎప్పటిలోగా ఈ కమిటీ నివేదికను సమర్పిస్తుందంటూ విజయసాయి రెడ్డి జల శక్తి మంత్రిని వివరణ అడిగారు.