గాయని చిత్రకు అరుదైన గౌరవం.. దేశ అత్యున్నత మూడో పురస్కారాన్ని అందుకోనున్న నైటింగెల్ ఆఫ్ సౌత్ ఇండియా..

నెటింగెల్ ఆఫ్ సౌత్ ఇండియా అనగానే గుర్తుకువచ్చే పేరు కేఎస్ చిత్ర. ఆమె పాడిన ఎన్నో పాటలు ప్రేక్షకుల మనసును ఆహ్లదానికి గురిచేస్తాయి. ప్రేమ,

గాయని చిత్రకు అరుదైన గౌరవం.. దేశ అత్యున్నత మూడో పురస్కారాన్ని అందుకోనున్న నైటింగెల్ ఆఫ్ సౌత్ ఇండియా..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 26, 2021 | 12:15 PM

నెటింగెల్ ఆఫ్ సౌత్ ఇండియా అనగానే గుర్తుకువచ్చే పేరు కేఎస్ చిత్ర. ఆమె పాడిన ఎన్నో పాటలు ప్రేక్షకుల మనసును ఆహ్లదానికి గురిచేస్తాయి. ప్రేమ, బాధ, కోపం, కరుణలాంటి భావాలెన్నో ఆమె గొంతులో అలవోకగా ఒదిగి.. అమృతాల నదిలా మనల్ని తాకుతుంటాయి. మెలోడీ క్వీన్ ఆఫ్ ఇండియాన్ సినిమాగా పేరుపొందిన కేఎస్ చిత్రకు కేంద్ర ప్రభుత్వ దేశ అత్యున్నత మూడో పురస్కారానికి ఎంపికచేసింది. 2005లో చిత్రను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిన కేంద్రం తాజాగా ఆమెకు పద్మ భూషన్ పురస్కారానికి ఎంపిక చేసింది. కేఎస్ చిత్ర 1985 నుంచి 14 సంవత్సరాల పాటు కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ గాయనిగా అవార్డు అందుకుంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం అందించనున్న పద్మ భూషణ్ పురస్కారాన్ని చిత్ర అందుకోనున్నారు.

Also Read:

Naveen Chandra : వరుస సినిమాలతో దూసుకుపోతున్న నవీన్ చంద్ర.. త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు..