ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆర్డీఎక్స్..అప్రమత్తమైన బలగాలు

ఢిల్లీ విమానాశ్రయంలో ఓ అనుమానాస్పద బ్యాగ్‌‌ కలకలం రేపింది. చాలా సేపటినుంచి అది అక్కడ ఉండటంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన బలగాలు బ్యాగ్ స్వాధీనం చేసుకోని చూడగా..అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో దాన్ని సీఐఎ‌స్‌ఎఫ్ సాయంతో ఓ ప్రయివేట్ ఫ్లేస్‌కు తరలించారు. ఆ బ్యాగ్‌‌లో అనుమానిత ఆర్డీఎక్స్, విద్యుత్తు తీగలు ఉన్నట్లు తెలుస్తోందని విమానాశ్రయ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు సంజయ్‌ భాటియా పేర్కొన్నారు. కాగా మరో 24 గంటల […]

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆర్డీఎక్స్..అప్రమత్తమైన బలగాలు
Follow us

|

Updated on: Nov 01, 2019 | 5:10 PM

ఢిల్లీ విమానాశ్రయంలో ఓ అనుమానాస్పద బ్యాగ్‌‌ కలకలం రేపింది. చాలా సేపటినుంచి అది అక్కడ ఉండటంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన బలగాలు బ్యాగ్ స్వాధీనం చేసుకోని చూడగా..అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో దాన్ని సీఐఎ‌స్‌ఎఫ్ సాయంతో ఓ ప్రయివేట్ ఫ్లేస్‌కు తరలించారు. ఆ బ్యాగ్‌‌లో అనుమానిత ఆర్డీఎక్స్, విద్యుత్తు తీగలు ఉన్నట్లు తెలుస్తోందని విమానాశ్రయ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు సంజయ్‌ భాటియా పేర్కొన్నారు. కాగా మరో 24 గంటల పాటు ఆ పేలుడు పదార్థాలను పరిశీలనలో ఉంచనున్నారు.

దీనితో ఎయిర్ పోర్ట్‌లో సెక్యూరిటీని టైట్ చేశారు. అనుమానాస్పద బ్యాగు కలకలంతో కొద్దిసేపు ఎయిర్ పోర్టులో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎరైవల్, ఎగ్జిట్ టెర్మినల్ నుంచి ప్రయాణికులను అధికారులు అనుమతించలేదు. టెర్మినల్ 3 బయటి రోడ్‌లను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బ్యాగులోని పదార్థాలను బాంబు స్క్యాడ్ సాయంతో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.  జమ్మూకశ్మీర్‌తో పాటు ఢిల్లీలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘావర్గాల సమాచారంతో కేంద్రం అప్రమత్తమైంది. ఎలాంటి ఉగ్ర దాడులు జరగకుండా నివారించేందుకు వీలుగా ఢిల్లీలోని ముఖ్యమైన ప్రాంతాలు, భవనాల వద్ద సాయుధ పోలీసులను మోహరించారు.