Woman Police Officer: ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న తొలి మహిళా పోలీస్ అధికారి.. దేశ రాజధాని ఢిల్లీలో నడిరోడ్డుపై..
Woman Police Officer: ఎన్‌కౌంటర్ మిషన్‌లో పాల్గొన్న తొలి మహిళా పోలీసు అధికారిణిగా ఢిల్లీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రియాంక నిలిచారు.
Woman Police Officer: ఎన్‌కౌంటర్ మిషన్‌లో పాల్గొన్న తొలి మహిళా పోలీసు అధికారిణిగా ఢిల్లీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రియాంక నిలిచారు. శుక్రవారం నాడు సెంట్రల్ ఢిల్లీలో కొందరు నిందితులు పారిపోతుండగా.. సెంట్రల్ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. బృందంలో ఎస్ఐ ప్రియాంక కూడా ఉన్నారు. ఆ క్రమంలో సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ సమీపానికి చేరుకోగానే.. నిందితుల్లో ఒకరిని ప్రియాంక పట్టుకునే ప్రయత్నించారు. అయితే అతను ప్రియాంకపై తుపాకీతో కాల్పులు జరిపాడు. నిందితుడు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ ఆమె ధరించిన జాకెట్‌కి తగిలింది. ఆ జాకెట్ బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రియాంక సేఫ్‌గా ఉన్నారు. ఫైనల్‌గా గ్యాంగ్‌స్టర్‌ని, అతని అనుచరులను అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ ఢిల్లీ క్రైబ్ బ్రాంచ్ పోలీసులు ప్రకటించారు.
Also read: