మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి.. రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధింపు..!
మహారాష్ట్రలో కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు.
Night curfew in Maharashtra: మహారాష్ట్రలో కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ముంబైతో పాటు ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండదని.. ప్రజలకు ముందుస్తుగా సమాచారం ఇస్తామని ఆయన చెప్పారు. ‘నేను లాక్‌డౌన్ విధించడానికి ఇష్టపడను.. కానీ కరోనా బాధితులు పెరుగుతుండడంతో ఆరోగ్య సంరక్షణా సౌకర్యాలు తగ్గిపోయే అవకాశం ఉంది’ అని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు భద్రతా నియమాలు పాటించకుంటే కఠినమైన చర్యలు తప్పదని హెచ్చరించారు.
మరోవైపు, మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి.దీంతో అన్ని అసుపత్రుల్లో తగిన పడకలు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. మహారాష్ట్రలో శుక్రవారం 36,902 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 112 మంది ప్రారంభించారు. రాష్ట్రంలో ఐదు రోజుల్లో 1.3 లక్షలకుపైగా కేసులు రికార్డయ్యాయి. కేబినెట్ సమావేశం అనంతరం బీడ్, నాందేడ్ జిల్లాల్లో పది రోజుల లాక్‌డౌన్ విధించారు. రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్‌కు బదులుగా స్థానిక పరిస్థితుల మేరకు లాక్‌డౌన్ విధింపునకు జిల్లా అధికారులకు లాక్‌డౌన్ విధించేందుకు అనుమతి ఇచ్చినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
Read Also… Bank Privatisation: 70 మిలియన్ల ఖాతాదారులకు శుభవార్త.. ప్రైవేటీకరించబడని బ్యాంకులు ఇవే..