Bank Privatisation: 70 మిలియన్ల ఖాతాదారులకు శుభవార్త.. ప్రైవేటీకరించబడని బ్యాంకులు ఇవే..
Bank Privatisation: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం చర్చలు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఒక..
Bank Privatisation: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం చర్చలు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ నిరంతరం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఇదే అంశంపై బడ్జెట్‌కు ముందు ఆర్‌బిఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరిగాయన్నారు. ఆ తరువాత కూడా చర్చించామని చెప్పారు. కాగా, బ్యాంకుల ప్రైవేటీకరణ అంశం చర్చ తీవ్రం కావడంతో, ఖాతాదారుల్లో చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏ బ్యాంకులు ప్రైవేటీకరించబడుతాయనే దానిపై నిర్దిష్ట సమాచారం లేనప్పటికీ.. ఏ బ్యాంకులు ప్రైవేటీకరించబడవనే దానిపై మాత్రం నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.
ఓ జాతీయ మీడియాలో ప్రచురించిన కథనం ప్రకారం.. పలు బ్యాంకులను ప్రైవేటీకరించొద్దని నీతియో ఆయోగ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఈ మధ్యకాలంలో ఏకీకృతం అయిన బ్యాంకులు ప్రైవేటీకరించబడవు. ప్రస్తుతం దేశంలో 12 ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. ఎస్‌బిఐ తోపాటు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రైవేటీకరణ జాబితాలో లేవని సదరు నివేదికలు చెబుతున్నాయి.
70 మిలియన్ల ఖాతాదారులకు శుభవార్త.. ఈ బ్యాంకులు ప్రైవేటీకరణ జాబితాకు వెలుపల ఉంటే, కనీసం 70 కోట్ల మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. వాటిపై ప్రైవేటీకరణ ప్రభావం ఉండదు. ఎస్‌బిఐ వినియోగదారుల సంఖ్య సుమారు 44 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వినియోగదారుల సంఖ్య సుమారు 18 కోట్లు. ఈ రెండు బ్యాంకుల మొత్తం వినియోగదారులు మాత్రమే 62 కోట్లు దాటారు.
10 బ్యాంకుల అనుసంధానం పూర్తి.. 2019 ఆగస్టులో ప్రభుత్వం 10 ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల విలీనాన్ని ప్రకటించింది. దీని కింద ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం అయ్యాయి. అలహాబాద్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లో విలీనం అయ్యింది. కెనరా బ్యాంక్‌లోని సిండికేట్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి.
Also read: