స్కూళ్ల మూసివేతతో ఇండియాకు భారీ నష్టం, ప్రపంచ బ్యాంకు అంచనా

కరోనా వైరస్ కారణంగా గత మార్చి నెల నుంచి పలు దేశాల్లో..ముఖ్యంగా ఇండియాలో స్కూళ్ళు మూసివేసిన ఫలితంగా భారీ నష్టం సంభవించే అవకాశాలున్నాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. విద్యా సంస్టల క్లోజర్ తో సుమారు 400 బిలియన్ డాలర్లకు పైగా లాస్ రావచ్ఛు.. పైగా విద్యార్థుల్లో చదవాలన్న లేదా నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా తగ్గిపోవచ్చు అని ఈ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే..దక్షిణాసియా మొత్తానికి 622 బిలియన్ డాలర్లు లేక […]

స్కూళ్ల మూసివేతతో ఇండియాకు భారీ నష్టం, ప్రపంచ బ్యాంకు అంచనా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 12, 2020 | 5:17 PM

కరోనా వైరస్ కారణంగా గత మార్చి నెల నుంచి పలు దేశాల్లో..ముఖ్యంగా ఇండియాలో స్కూళ్ళు మూసివేసిన ఫలితంగా భారీ నష్టం సంభవించే అవకాశాలున్నాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. విద్యా సంస్టల క్లోజర్ తో సుమారు 400 బిలియన్ డాలర్లకు పైగా లాస్ రావచ్ఛు.. పైగా విద్యార్థుల్లో చదవాలన్న లేదా నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా తగ్గిపోవచ్చు అని ఈ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే..దక్షిణాసియా మొత్తానికి 622 బిలియన్ డాలర్లు లేక ఇది మరింత పెరిగి 880 బిలియన్ డాలర్లకు కూడా చేరవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు వరల్డ్ బ్యాంక్ అధికారులు. ‘బీటెన్ ఆర్ బ్రోకెన్..ఇన్ ఫర్మాలిటీ అండ్ కోవిడ్-19 ఇన్ సౌతిండియా’ పేరిట ఈ నివేదికను రిలీజ్ చేశారు. ఈ పాండమిక్ కారణంగా సుమారు 50 లక్షల మందికి పైగా విద్యార్థులు డ్రాపవుట్స్ గానే మిగిలిపోవచ్చు అని కూడా వారు పేర్కొన్నారు.