ఆ హీరోతో అయితే రెమ్యునరేషన్ లేకుండా చేస్తానంటున్న శృతిహాసన్.. ఇంతకు ఆ హీరో ఎవరంటే…
అందాలభామ శృతిహాసన్ కొంతకాలం గ్యాప్ తర్వాత తిరిగి సినిమాల్లో బిజీ అయిన విషయం తెలిసిందే. మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
అందాలభామ శృతిహాసన్ కొంతకాలం గ్యాప్ తర్వాత తిరిగి సినిమాల్లో బిజీ అయిన విషయం తెలిసిందే. మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న ‘క్రాక్’ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తుంది.
పవన్ కళ్యాణ్ తో కలిసి ‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ సినిమా తర్వాత మూడోసారి పవన్ తో జతకడుతుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే ఈ అమ్మడికి ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని కోరికగా ఉందట. ఆ హీరో ఎవరోకాదు రెబల్ స్టార్ ప్రభాస్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శృతి ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. ప్రభాస్ తో సినిమా అంటే రెమ్యునరేషన్ కూడా తీసుకోను అంటూ చెప్పుకొచ్చింది. ప్రభాస్ సినిమాలో అవకాశం వస్తే పారితోషికం తనకు అసలు సమస్య కాదు అంటుంది. ఎంత ఇచ్చినా కూడా ఆయన సరసన నటిస్తానని శృతిహాసన్ అంటుంది. తనకు ప్రభాస్ తో నటించడం కల అని చెప్పింది ఈ ముద్దు గుమ్మా. మరి ఈ అమ్మడి కోరిక ఏ దర్శకుడు నెరవేరుస్తాడు అనేది చూడాలి.