బన్నీ మేనమామ హఠాన్మరణం.. తీవ్ర విషాదంలో అల్లు ఫ్యామిలీ!
బన్నీ మేనమామ.. ఏఏ 20 నిర్మాత ముత్తంశెట్టి ప్రసాద్ అకాల మరణం చెందారు. నిన్న విజయవాడలో ఆయన తీవ్రమైన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ‘అల వైకుంఠపురములో’ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న అల్లు ఫ్యామిలీకి ఈ ఊహించని షాక్ తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ముత్తంశెట్టి ప్రసాద్ బన్నీ-సుకుమార్‌ల చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఇలా ఆకస్మికంగా ఆయన కన్ను మూయడంతో అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ముత్తంశెట్టి ప్రసాద్ స్వయానా అల్లు అర్జున్ తల్లి […]
బన్నీ మేనమామ.. ఏఏ 20 నిర్మాత ముత్తంశెట్టి ప్రసాద్ అకాల మరణం చెందారు. నిన్న విజయవాడలో ఆయన తీవ్రమైన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ‘అల వైకుంఠపురములో’ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న అల్లు ఫ్యామిలీకి ఈ ఊహించని షాక్ తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ముత్తంశెట్టి ప్రసాద్ బన్నీ-సుకుమార్‌ల చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు.
ఇలా ఆకస్మికంగా ఆయన కన్ను మూయడంతో అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ముత్తంశెట్టి ప్రసాద్ స్వయానా అల్లు అర్జున్ తల్లి నిర్మలాదేవికి అన్నయ్య.. బన్నీకి పెద్ద మావయ్య. ఇక మేనమామతో బన్నీ చిన్నప్పటి నుంచి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇద్దరిది విడదీయరాని బంధం. కాగా, ఈ విషాద వార్త తెలియగానే అల్లు కుటుంబం అంతా విజయవాడకు వెళ్లారు. కాగా, కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు వారికి తమ సంతాపాన్ని తెలియజేశారు.