‘నా దగ్గర 121 మంది బీజేపీ నేతల పేర్లున్నాయ్ ! ఈడీకి ఆ ఫైల్ అంతా ఇచ్ఛేస్తా’..శివసేన నేత సంజయ్ రౌత్, నో పానిక్ !
పీ ఎం సీ బ్యాంకు నిధుల గోల్ మాల్ విషయంలో తన భార్యకు ఈడీ సమన్లు జారీ చేయడంపై శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ పోరాటాలను ముఖాముఖీగా తేల్చుకోవాలి గానీ ఇలా కక్షలతో కాదన్నారు.
పీ ఎం సీ బ్యాంకు నిధుల గోల్ మాల్ విషయంలో తన భార్యకు ఈడీ సమన్లు జారీ చేయడంపై శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ పోరాటాలను ముఖాముఖీగా తేల్చుకోవాలి గానీ ఇలా కక్షలతో కాదన్నారు. ఈడీ, సీబీఐ లేదా ఐటీ వంటి సంస్థల ప్రాధాన్యం రోజురోజుకీ తగ్గిపోతోందని, ఇటీవలి సంవత్సరాల్లో వీటిని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ (బీజేపీ) పొలిటికల్ కక్ష సాధించడానికి వినియోగించడం ఎక్కువైందని ఆయన ఆరోపించారు. తన వద్ద బీజేపీకి సంబంధించిన ఓ ఫైల్ ఉందని, అందులో 121 మంది నేతల పేర్లు ఉన్నాయని చెప్పిన ఆయన.. దీన్ని ఈడీకి అందజేస్తానని చెప్పారు. వీరి పని పట్టాలంటే ఈ సంస్థకు ఐదేళ్లు పడుతుందని అన్నారు. సీఎం ఉధ్ధవ్ థాక్రే తో నేను మాట్లాడాను..ఆయన, శివసేన బీజేపీకి సరైన సమాధానమిస్తారన్నారు. ఈ ఫైల్ లో తమ పార్టీకి చెందిన ఎవరెవరి పేర్లు ఉన్నాయో భారతీయ జనతా పార్టీ తెలుసుకోవాలి అన్నారు.
ఈ విధమైన బెదిరింపులకు తాము బెదిరిపోమని, మీరు నన్నేం చేయలేరని హూంకరించారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ముందా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.