AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం.. చాటింగ్ చేస్తూ భవనం పైనుంచి పడి యువతి మృతి

ఫోన్ చాటింగ్ చేస్తూ మూడంతస్తుల భవనం‌పై నుండి కింద పడి యువతి మృతి చెందిన ఘటన శంషాబాద్ మండల పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలు ఎయిర్ పోర్ట్ కస్టమర్ సర్వీసెస్‌లో పనిచేసే ఉద్యోగిని సిమ్రాన్‌‌గా తెలుస్తోంది. ఆమె స్వస్థలం కర్నాటకలోని ముధోల్‌ టౌన్‌ విద్యాగిరినగర్‌‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా యువతి పడిపోవడం కొందరు స్థానికులు ప్రత్యక్షంగా చూడటంతో భయాందోళనలకు గురయ్యారు. ఇక నంద్యాల […]

విషాదం.. చాటింగ్ చేస్తూ భవనం పైనుంచి పడి యువతి మృతి
Ram Naramaneni
|

Updated on: Jan 14, 2020 | 9:15 PM

Share

ఫోన్ చాటింగ్ చేస్తూ మూడంతస్తుల భవనం‌పై నుండి కింద పడి యువతి మృతి చెందిన ఘటన శంషాబాద్ మండల పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలు ఎయిర్ పోర్ట్ కస్టమర్ సర్వీసెస్‌లో పనిచేసే ఉద్యోగిని సిమ్రాన్‌‌గా తెలుస్తోంది. ఆమె స్వస్థలం కర్నాటకలోని ముధోల్‌ టౌన్‌ విద్యాగిరినగర్‌‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా యువతి పడిపోవడం కొందరు స్థానికులు ప్రత్యక్షంగా చూడటంతో భయాందోళనలకు గురయ్యారు.

ఇక నంద్యాల మండలం నూనెపల్లెలో  మరో విషాద ఘటన చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో  ధనుష్ అనే బాలుడు టెర్రస్‌పైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తుండగా, ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలింది. తీవ్ర గాయాలవడంతో అతన్ని నంద్యాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కొరకు కర్నూలుకు తరలించారు.

Follow Us