AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 బృందాలు.. 500కు పైగా సీసీ కెమెరాలు.. సైకో కిల్లర్ రాజ్‌కుమార్ రైలు ఎక్కి వెళ్లిపోయాడా..?

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని దారుణంగా హత్య చేసిన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటివరకు 500కు పైగా సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు, అతడు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ నుంచి రైలు ఎక్కి కర్నాటక లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితుడిని పట్టుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

12 బృందాలు.. 500కు పైగా సీసీ కెమెరాలు.. సైకో కిల్లర్ రాజ్‌కుమార్ రైలు ఎక్కి వెళ్లిపోయాడా..?
Shabad Six Murders Case
Shaik Madar Saheb
|

Updated on: Jul 13, 2026 | 7:51 AM

Share

రంగారెడ్డి జిల్లా షాబాద్ మర్డర్స్ నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజ్‌కుమార్ ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. తిమ్మాపూర్ స్టేషన్ నుంచి రైలు ఎక్కి వెళ్లిపోయినట్టు అనుమానిస్తున్నారు. కర్నాటక లేదంటే ఏపీ సహా ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 500కు పైగా సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే.. ఈ క్రమంలోనే.. సైకో కిల్లర్ రాజ్‌కుమార్ దొరికాడు అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పోలీసులు ప్రకటించారు.. హత్యలు చేసిన అనంతరం ఎక్కడకు వెళ్లాలనే విషయంలో రాజ్‌కుమార్ పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. తనతో పాటు కొంత డబ్బును కూడా తీసుకెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

నిందితుడు వదిలి వెళ్లిన కారు లభ్యమైన పరిసర గ్రామాలతో పాటు, తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. రాజ్‌కుమార్‌ తల్లి ఊరిలో సన్నిహితులు, సమీప బంధువులు, కాల్‌డేటాలోని వ్యక్తులు ఉన్న ప్రాంతాల్లోనూ గాలిస్తున్నారు.

రాజ్‌కుమార్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. షాబాద్‌ పరిధి దైవాలగూడకు చెందిన పార్వతి రాజ్‌కుమార్‌ మానవ మృగంలా మారి రెండు కుటుంబాల గొంతులు కోశాడు. శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత కత్తితో కిరాతకాన్ని మొదలుపెట్టి, అరగంటలో రాజ్ కుమార్ ఆరుగురి ప్రాణాలు తీశాడు.

కాగా.. రాజ్‌కుమార్‌ కోసం ఇప్పటికే.. 12 పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అన్ని మార్గాల్లో సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us