AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ 24వ విడత ఎప్పుడు..? కేంద్రం నుంచి క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..!

ఇటీవలే కేంద్రం 23వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 24వ విడత సొమ్ముపై చర్చ జరుగుతోంది. తర్వాతి విడత నగదు ఎప్పుడు జమ చేస్తారనేది హాట్‌టాపిక్‌గా మారింది. తాజా సమాచారం మేరకు..

PM Kisan: పీఎం కిసాన్ 24వ విడత ఎప్పుడు..? కేంద్రం నుంచి క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..!
Pm Kisan
Venkatrao Lella
|

Updated on: Jul 13, 2026 | 7:06 AM

Share

కేంద్ర ప్రభుత్వం ఇటీవల 23వ విడత పీఎం కిసాన్ నగదును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. గత నెల 20వ తేదీన ప్రధాని మోదీ స్వయంగా తన చేతుల మీదుగా డబ్బులు రిలీజ్ చేశారు. ఇప్పటికే రైతుల బ్యాంక్ అకౌంట్లలో ఇవి పడగా.. కొంతమంది రైతులకు ఇంకా జమ కాలేదు. సాంకేతిక కారణాలతో నిధులు పొందలేనివారు సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్రం చెబుతోంది. పీఎం కిసాన్ పోర్టల్‌లో ఈకేవైసీ పూర్తి చేయడం, బ్యాంక్ రికార్డులు తనిఖీలు చేయడం, పట్టాదారు పాస్‌బుకుల్లో తప్పులు సరిదిద్దుకోవడం లేదా ఇతర సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల వెంటనే సొమ్ము అకౌంట్లో పడుతుంది. డబ్బులు పడనివారు పీఎం కిసాన్ పోర్టల్ లేదా సమీపంలోని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి సమస్య ఏంటనేది తెలుసుకుని పరిష్కరించుకోవాలని కేంద్రం పేర్కొంది.

24వ విడతపై ఫుల్ క్లారిటీ

అయితే 23వ విడత ప్రక్రియ పూర్తి చేయగా.. 24వ విడత ఎప్పుడు జమ అవుతుందనే విషయంపై చర్చ నడుస్తోంది. అయితే తర్వాతి విడత నిధులు అక్టోబర్‌లో కేంద్రం జమ చేయనుందని తెలుస్తోంది. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి మోదీ సర్కార్ డబ్బులు రిలీజ్ చేస్తోంది. జూన్‌లో 23 విడత విడుదల చేయడంతో.. నాలుగు నెలల తర్వాత అక్టోబర్‌లో తర్వాతి ఇన్‌స్టాల్‌మెంట్ వేయనున్నారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం కూడా పంపిణీ చేస్తుండగా.. వీటిని నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతలుగా ఇస్తున్నారు. ఏప్రిల్ నుంచి జులై వరకు, ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు, డిసెంబర్ నుంచి మార్చి వరకు మూడు విడతలుగా వీటిని అందిస్తున్నారు.

ఈకేవైసీ తప్పనిసరి

అయితే ఈ నగదు అందుకోవాలంటే ఈకేవైసీని కేంద్రం తప్పనిసరి చేసింది. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసి ఉండాలి. ఇక కొన్ని రాష్ట్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదై 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. ఇక ఆధార్-బ్యాంక్ అకౌంట్ లింక్ కూడా తప్పనిసరి. ఇవన్నీ పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ నగదు ఎలాంటి అవాంతరాలు లేకుండా అందుతుంది. వీటిల్లో ఏమైనా పెండింగ్‌లో వీటినే సొమ్ము నిలిచిపోతుంది. మళ్లీ పూర్తి చేసిన తర్వాతనే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. దీంతో ఈకేవైసీ ప్రతీఒక్కరూ పూర్తి చేయాలని లబ్దిదారులకు కేంద్రం సూచిస్తోంది.

Follow Us
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!