AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణ మనవడు అదరగొట్టాడుగా.. ఆకట్టుకుంటున్న శ్రీనివాస మంగాపురం ట్రైలర్

అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ చందమామ కథలు బ్యానర్ నిర్మాణంలో జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని హీరో హీరోయిన్స్ గా , అజయ్ భూపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం' లవ్, ఇంటెన్స్ ఎమోషన్స్, పవర్ ఫుల్ యాక్షన్ థియేట్రికల్ ట్రైలర్‌ విడుదలైంది.

కృష్ణ మనవడు అదరగొట్టాడుగా.. ఆకట్టుకుంటున్న శ్రీనివాస మంగాపురం ట్రైలర్
Srinivasa Mangapuram
Rajeev Rayala
|

Updated on: Jul 13, 2026 | 6:37 AM

Share

సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని ఈ చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తోంది. సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించి, అశ్విని దత్ సమర్పిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. ప్రతి అప్‌డేట్‌కు గొప్ప స్పందన లభిస్తోంది. తాజాగా నిర్మాతలు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

శ్రీనుకు మంగా అంటే ప్రాణం. మొదట అతని ప్రేమను అంగీకరించని మంగా, అతని నిజమైన ప్రేమను చూసి చివరకు ప్రేమలో పడుతుంది. ఇద్దరి ప్రేమ అందంగా సాగుతున్న సమయంలో బళ్లారి రాజు వెంకటప్పయ్య నాయుడు వారి జీవితాల్లోకి వస్తాడు. వారి ప్రేమకు అతడే అతిపెద్ద అడ్డంకిగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి ప్రేమ గెలిచిందా? అనేదే సినిమా కథ. ప్రేమ కథలను తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు అజయ్ భూపతి, ఈ చిత్రాన్ని ప్రేమ, యాక్షన్, బలమైన భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా అద్భుతంగా రూపొందించారు. ట్రైలర్ సినిమా అసలు కాన్సెప్ట్‌ను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ, కథపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

తొలి సినిమాతోనే జై కృష్ణ ఘట్టమనేని ఆదరగొట్టారు. స్క్రీన్‌పై చాలా సహజంగా కనిపించడమే కాకుండా, డైలాగ్ డెలివరీ, హావభావాలు, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ప్రేమ సన్నివేశాల్లో చక్కటి హావభావాలు చూపించిన ఆయన, యాక్షన్ సన్నివేశాల్లో కూడా మంచి ఇంటెన్సిటీని ప్రదర్శించారు. రాషా తడానీ తన అందమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు నటనతో కూడా ఆకట్టుకున్నారు. జై కృష్ణ, రాషా మధ్య కెమిస్ట్రీ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విలన్‌గా డాక్టర్ మోహన్ బాబు తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రతి సన్నివేశంలో ప్రత్యేకంగా కనిపించారు. టెక్నికల్‌గా కూడా సినిమా ఉన్నత ప్రమాణాలతో రూపొందింది. జయకృష్ణ ఐఎస్‌సీ అందించిన విజువల్స్ ప్రేమ, యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చూపించాయి. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మంచి బలం చేకూర్చింది. మాధవ్ కుమార్ గుల్లపాటి ఎడిటింగ్ ట్రైలర్‌ మరింత గ్రిప్పింగ్ గా ప్రజెంట్ చేసింది. సాహి సురేష్ రూపొందించిన సెట్స్ సినిమాకు మరింత గ్రాండ్ లుక్ తీసుకొచ్చాయి. ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ ప్రేమ, యాక్షన్, భావోద్వేగాలతో ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై ట్రైలర్ మరింత ఆసక్తిని పెంచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ఆకట్టుకుంటున్న శ్రీనివాస మంగాపురం ట్రైలర్
ఆకట్టుకుంటున్న శ్రీనివాస మంగాపురం ట్రైలర్
వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి.. సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే
వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి.. సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే
నల్లగా మారిన వెండి ఆభరణాలను క్షణాల్లో మెరిపించే సూపర్ చిట్కా!
నల్లగా మారిన వెండి ఆభరణాలను క్షణాల్లో మెరిపించే సూపర్ చిట్కా!
పండుగొస్తే తెలంగాణ ఇళ్లలో ఘుమఘుమలాడే నూనెలేని మాంసం కూర
పండుగొస్తే తెలంగాణ ఇళ్లలో ఘుమఘుమలాడే నూనెలేని మాంసం కూర
పబ్‌లో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది ఆహుతి
పబ్‌లో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది ఆహుతి
కోడి గుడ్డుతో ఇలా చేసి తింటే ఇమ్యూనిటీతో పాటు 30 రోజులు నిల్వ
కోడి గుడ్డుతో ఇలా చేసి తింటే ఇమ్యూనిటీతో పాటు 30 రోజులు నిల్వ
వీరి జీవితంలో సంతోషాల జాతర మొదలుపెట్టనున్న రాహువు..
వీరి జీవితంలో సంతోషాల జాతర మొదలుపెట్టనున్న రాహువు..
100 శివరాత్రులతో సమానమైన పవిత్ర సోమవారం.. శివుడిని ఈ విధంగా..
100 శివరాత్రులతో సమానమైన పవిత్ర సోమవారం.. శివుడిని ఈ విధంగా..
11 ప్లాపులతో ఐరన్ లెగ్ .. 51 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..
11 ప్లాపులతో ఐరన్ లెగ్ .. 51 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..
పవన్ కళ్యాణ్‌కు భుజం ఆపరేషన్ సక్సెస్, కానీ.. హెల్త్ బులెటిన్‌లో..
పవన్ కళ్యాణ్‌కు భుజం ఆపరేషన్ సక్సెస్, కానీ.. హెల్త్ బులెటిన్‌లో..