కరోనా వ్యాక్సిన్: నిధులు సేకరణలో సీరం ఇన్స్టిట్యూట్..!
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కొవిడ్ -19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కొవిడ్ -19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి బిలియన్ డాలర్ల మేర సేకరించనున్నది. బ్లాక్‌స్టోన్, కేకేఆర్‌తో పాటు ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులతో ఎస్ఐఐ చర్చలు జరుపుతున్నది. టీకా అభ్యర్థుల కోసం సంస్థ ప్రత్యేక ప్రయోజన వాహనాన్ని (ఎస్‌పీవీ) సిద్ధం చేస్తున్నది. సేకరించే నిధులన్నీ సీరం ఇన్స్టిట్యూట్ కాకుండా టీకా అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించనున్నారు. తన నిధుల సేకరణ మిషన్‌ను సెప్టెంబర్ నాటికి తగ్గించాలని యోచిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నది.
Read More:
గోదావరి కి పోటెత్తిన వరద.. జలదిగ్బంధంలో 60 గ్రామాలు..!



