‘ఏరా నాకు రెమ్యునరేషన్ ఇస్తావా’.. చిరు గురించి చెబుతూ లైవ్‌లో ఏడ్చేసిన శరత్ కుమార్

'ఏరా నాకు రెమ్యునరేషన్ ఇస్తావా'.. చిరు గురించి చెబుతూ లైవ్‌లో ఏడ్చేసిన శరత్ కుమార్

చిరంజీవితో తనకు చాలా క్లోజ్ రిలేషన్ ఉందని అన్నారు. చిరు తనకు స్నేహితుడికంటే ఎక్కువన్నారు. తన జీవితంలో జరిగిన ఓ అరుదైన సంఘటనని శరత్ కుమార్ బయట పెట్టారు. చిరంజీవి గారితో 'గ్యాంగ్ లీడర్' సినిమాలో నటించేటప్పుడే..

TV9 Telugu Digital Desk

| Edited By:

May 10, 2020 | 5:18 PM

సినీ పరిశ్రమలో ఎందరో ప్రాణ స్నేహితులు ఉంటారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి, రాధిక, రాధిక భర్త శరత్ కుమార్‌‌లు ఒకరనే చెప్పాలి. తమిళ ఇండస్ట్రీలో శరత్ కుమార్ సీనియర్ నటుడు. కాగా లాక్‌డౌన్ కారణంగా ఎఫెక్ట్‌తో ఇంటి వద్దనే ఉంటోన్న సెలబ్రిటీలు పలు మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీంతో వారి మనసులో దాగివున్న ఎన్నో భావోద్వేగాలు బయటపడుతున్నాయి. అలా మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక విషయం చెబుతూ లైవ్‌లోనే ఏడ్చేశారు నటుడు శరత్ కుమార్.

శరత్ కుమార్ మాట్లాడుతూ.. చిరంజీవితో తనకు చాలా క్లోజ్ రిలేషన్ ఉందని అన్నారు. చిరు తనకు స్నేహితుడికంటే ఎక్కువన్నారు. తన జీవితంలో జరిగిన ఓ అరుదైన సంఘటనని శరత్ కుమార్ బయట పెట్టారు. చిరంజీవి గారితో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించేటప్పుడే.. మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాడు. అయితే సడన్‌గా ఓ సమయంలో అప్పుల్లో కూరుకుపోయా. అప్పుడే ఓ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించే అవకాశం వచ్చింది. ఆ చిత్రాన్ని చిరంజీవి గారితో చేయాలని అనుకున్నాం. వెంటనే చిరుకి ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పా. మాట్లాడమని చెప్పారు. అందుకు నేను ఫోన్‌లో కాదు పర్సనల్‌గా మాట్లాడాలి అని అడిగా.. ఓకే ఇంటికి వచ్చేయ్ అన్నారు. ఒకరోజు ఆయన కోసం వెళ్లా. ఆ సమయంలో చిరంజీవి ఫైట్‌ సీన్‌లో ఉన్నాడు. నేను వెళ్లగానే.. వెంటనే డైరెక్టర్‌తో చెప్పి షూటింగ్ క్యాన్సిల్ చేశారు. నేను షాక్ అయ్యా. నా కోసం శరత్ గారు వచ్చారు కాబట్టి షూటింగ్ రేపు పెట్టుకుందా అని ప్రొడ్యూసర్‌తో చెప్పేసి నన్ను ఇంటికి తీసుకెళ్లారు.

కాగా అప్పటికే ఇంటికి ఫోన్‌ చేసి నాకోసం మంచి వంటకాలు చేయించారు. భోజనం చేశాక.. ప్రస్తుతం నేను ఇబ్బందుల్లో ఉన్నానని.. ఓ సినిమానికి నిన్ను హీరో అనుకుంటున్నామని చెప్పి.. డేట్స్ కావాలని అడిగా. ప్రజెంట్ ఓ చిత్రం చేస్తున్నా.. ఇది పూర్తి కాగానే నా డేట్స్ తీసుకో అన్నారు. ఆ తర్వాత రెమ్యునరేషన్ ఎంత కావాలి అని అడగ్గా.. ‘ఏరా నువ్వు నాకు రెమ్యునరేషన్ ఇస్తావా.. అసలే ఇబ్బందుల్లో ఉన్నావు కదా!’ నాకు రెమ్యునరేషన్ అక్కర్లేదు. నీ కోసం నేను సినిమా చేస్తా పో అని అన్నాడు. అలా చెబుతూ లేవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు శరత్. అది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. ఈ విషయాన్ని నేను ఇంతవరకూ ఎవరికీ చెప్పలేదు అని పేర్కొన్నారు శరత్ కుమార్.

Read More:

ఈ రోజు రాత్రికే గుడిలో ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి..

గుండెపోటుతో యంగ్ డైరెక్టర్ మృతి.. షాక్‌లో సినీ ప్రముఖులు

బ్రేకింగ్: భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu