రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ.. మేటర్ ఇదే!

తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. సోమవారం ఈ మేరకు అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులకు లేఖలను పంపించారు ఎన్నికల సంఘం అధికారులు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమైంది.

రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ.. మేటర్ ఇదే!
Follow us

|

Updated on: Sep 21, 2020 | 6:03 PM

తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. సోమవారం ఈ మేరకు అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులకు లేఖలను పంపించారు ఎన్నికల సంఘం అధికారులు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమైంది.

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలక మండలి పదవీ కాలం ఫిబ్రవరి, 2020తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. రాజకీయ పార్టీలు కూడా తమతమ కసరత్తును ఇప్పటికే మొదలు పెట్టగా.. ఈసీ సైతం ఎన్నికల నిర్వహణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది.

రానున్న జీహెచ్ఎంసిీ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలు పంపింది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలా లేక ఈవీఎంల ద్వారా నిర్వహించాలా అన్న విషయంలో రాజకీయ పార్టీ తమ అభిప్రాయాలను తెలుపాలన్నది ఈసీ రాసిన లేఖల సారాంశం. ఎన్నికల నిర్వహణ కసరత్తులో ముందుగా తేలాల్సిన అంశంగా దీనిని ప్రాధాన్యతగా తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగా రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు యత్నిస్తోంది.

సెప్టెంబర్ 30వ తేదీ లోపు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలపాలని, ఏమైనా సూచనలు వుంటే తెలియజేయాలని ఈసీ లేఖలో పేర్కొన్నది. 30వ తేదీ తరువాత ఇచ్చే సూచనలు పరిగణనలోకి తీసుకోబడవని ఎన్నికల అధికారి తేల్చి చెప్పడం విశేషం.