స్పెషల్ కోర్టులు అక్కర్లేదు- సుప్రీం

న్యూఢిల్లీ: ఎలక్షన్స్ కోడ్ ఉల్లంఘనల కేసులను విచారించడానికి స్ఫెషల్ కోర్ట్స్ అక్కర్లేదని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే విచారణ వేగవంతంగా జరపడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇదిలా ఉంటే వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. భారత నావికా దళం వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ఫొటోలు ప్రచార ఫ్లెక్సీల్లో వాడవద్దని ఎన్నికల […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:35 am, Sat, 16 March 19
స్పెషల్ కోర్టులు అక్కర్లేదు- సుప్రీం

న్యూఢిల్లీ: ఎలక్షన్స్ కోడ్ ఉల్లంఘనల కేసులను విచారించడానికి స్ఫెషల్ కోర్ట్స్ అక్కర్లేదని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే విచారణ వేగవంతంగా జరపడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

ఇదిలా ఉంటే వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. భారత నావికా దళం వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ఫొటోలు ప్రచార ఫ్లెక్సీల్లో వాడవద్దని ఎన్నికల కమిషన్ చెప్పింది. అయినా జైపూర్ జీజేపీ ఎంపీ రామ్‌చరణ్‌ బొహ్రా, రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ ఈ నియమాలను పెడచెవిన పెట్టారు. భారత ఆర్మీతో పాటు అభినందన్ పోటోలతో ప్రచారం నిర్వహిస్తుండటంతో ఈసీ సీరియస్ అయ్యింది. వెంటనే వారికి నోటీసులు జారీ చేసింది.