అమరు జవాన్ల రుణాలు మాఫీ చేయనున్న ఎస్‌బీఐ

| Edited By: Srinu

Mar 07, 2019 | 7:37 PM

దిల్లీ: నాలుగు రోజుల క్రితం పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్లకు ఒక్కొక్కరికీ రూ.30లక్షల చొప్పున ఇన్సూరెన్స్‌ మొత్తాన్ని విడుదల చేసేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సిద్ధమైంది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లందరూ ఎస్‌బీఐలో ఖాతాదారులు. ఈ బ్యాంకు ఖాతా నుంచే జవాన్లకు వేతనం అందుతోంది. ఈ మొత్తాన్ని జవాన్ల కుటుంబాలకు అందజేయనున్నట్లు ఎస్‌బీఐ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్లలో 23 మంది జవాన్లు […]

అమరు జవాన్ల రుణాలు మాఫీ చేయనున్న ఎస్‌బీఐ
Follow us on

దిల్లీ: నాలుగు రోజుల క్రితం పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్లకు ఒక్కొక్కరికీ రూ.30లక్షల చొప్పున ఇన్సూరెన్స్‌ మొత్తాన్ని విడుదల చేసేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సిద్ధమైంది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లందరూ ఎస్‌బీఐలో ఖాతాదారులు. ఈ బ్యాంకు ఖాతా నుంచే జవాన్లకు వేతనం అందుతోంది. ఈ మొత్తాన్ని జవాన్ల కుటుంబాలకు అందజేయనున్నట్లు ఎస్‌బీఐ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్లలో 23 మంది జవాన్లు ఎస్‌బీఐలో రుణం పొందినవారున్నారు. ఈ జవాన్ల మొత్తం రుణాలను మాఫీ చేయనున్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు.దీంతోపాటు ఎస్‌బీఐ ఉద్యోగులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలని కోరింది. ఇందుకోసం ఎస్‌బీఐ యూపీఐని సైతం ఏర్పాటు చేసింది. దీని ద్వారా ‘భారత్‌ కే వీర్‌’కు తమ వంతు సాయం చేస్తామని తెలిపింది. కేవలం ఉద్యోగులే కాకుండా బయటి వ్యక్తులు ఎవరైనా విరాళంగా అందించాలనుకుంటే బ్యాంకు వర్గాలను సంప్రదించాలని సూచించింది.