వృక్షో రక్షతి రక్షితః: సాయాజీ షిండే

వృక్షో రక్షతి రక్షితః’ అనగా.. చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం. ఈ ధర్మాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ వేలాది చెట్లను నాటుతూ.. నాటిస్తూ ప్రకృతి ప్రేమికుడుగా మారారు ప్రముఖ నటుడు సాయాజీ షిండే. మొక్కలపై ఉన్న తన ఇష్టాన్ని తెలియజేస్తూ.. అన్ని పాఠశాలల్లోనూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సాయాజీ షిండే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘ఠాగూర్’ చిత్రంతో ఇండస్ట్రీకి విలన్‌గా పరిచయం అయ్యారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మొక్కలపై ఉన్న […]

వృక్షో రక్షతి రక్షితః: సాయాజీ షిండే
Follow us

| Edited By:

Updated on: May 07, 2019 | 6:25 PM

వృక్షో రక్షతి రక్షితః’ అనగా.. చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం. ఈ ధర్మాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ వేలాది చెట్లను నాటుతూ.. నాటిస్తూ ప్రకృతి ప్రేమికుడుగా మారారు ప్రముఖ నటుడు సాయాజీ షిండే. మొక్కలపై ఉన్న తన ఇష్టాన్ని తెలియజేస్తూ.. అన్ని పాఠశాలల్లోనూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

సాయాజీ షిండే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘ఠాగూర్’ చిత్రంతో ఇండస్ట్రీకి విలన్‌గా పరిచయం అయ్యారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మొక్కలపై ఉన్న ఇష్టంతో ఇప్పటి వరకు 3.5 లక్షల చెట్లను నాటారు. అంతరించిపోతున్న భారత వృక్ష జాతులను కాపాడటానికి ఆయన ట్రీ లవ్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించారు. చాలా నగరాల్లో ‘సాయాజీ పార్క్స్’ నిర్మించారు. వీటిలో అనేక భారతీయ వృక్ష జాతుల మొక్కలు సంరక్షించబడుతున్నాయి. అహ్మద్ నగర్‌లోని ప్రియదర్శిని పబ్లిక్ స్కూల్‌లో మొదటగా స్కూల్ నర్సరీని ప్రారంభించారు సాయాజీ షిండే. ఈ మొక్కలకు పుట్టినరోజులను కూడా నిర్వహించడం మరో విశేషం.