AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కేటీఆర్, ‘శంకర ఐ ఫౌండేషన్’ ను స్వాగతించాలని పిలుపు

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత కంటి సంరక్షణ ప్రదాత అయిన 'శంకర..

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కేటీఆర్, 'శంకర ఐ ఫౌండేషన్' ను స్వాగతించాలని పిలుపు
Venkata Narayana
|

Updated on: Dec 09, 2020 | 8:01 PM

Share

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత కంటి సంరక్షణ ప్రదాత అయిన ‘శంకర ఐ ఫౌండేషన్’ హైదరాబాద్ కు వస్తోందంటూ ప్రకటించారు. దేశవ్యాప్తంగా మిలియన్ల మంది పేద ప్రజలకు ఈ కంటి ఆస్పత్రి సేవలందిస్తుందని తెలిపారు. అంతేకాదు, దీని ప్రధాన కార్యాలయం(కోయంబత్తూర్, తమిళనాడు) తర్వాత ఏర్పాటు చేయబోయే అత్యంత పెద్ద ఆస్పత్రిగా ఇది ఉండబోతుందని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ గ్రామీణ ప్రజలకు సేవ చేయడమే ఈ కంటి ఆస్పత్రి ప్రధాన ఉద్దేశ్యమని దీనిని అందరూ తెలంగాణకు స్వాగతించాలని కేటీఆర్ కోరారు.