సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఫ్రీగా చూడాలనుకుంటున్నారా.. అయితే ఒక్కసారి ఈ ఆఫర్ గమనించండి..
వివాదాలతో తరచుగా వార్తల్లో నిలిచే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ స్ట్రీమింగ్‌తో వినియోగదారులకు గాలం వేస్తోంది.
వివాదాలతో తరచుగా వార్తల్లో నిలిచే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ స్ట్రీమింగ్‌తో వినియోగదారులకు గాలం వేస్తోంది. ఇటీవల రిలీజైన ఓ వెబ్ సిరీస్ వల్ల మద్యప్రదేశ్‌లో ఈ సంస్థపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులను పెంచుకోవడం కోసం రకరకాల ఆఫర్లను ప్రకటిస్తుంది ఈ సంస్థ.
మొదట్లో చాలా తక్కువగా ఉన్న ఓటీటీ ప్లాట్ ఫాంలు కరోనా పుణ్యమా అని ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో పోటీని తట్టుకోవడానికి ఈ సంస్థలు ఆపర్లను ప్రకటిస్తున్నాయి. తొలి రోజుల్లో ఫ్రీ స్ట్రీమింగ్ ప్రకటించిన ఈ సంస్థ తరువాత కాంపిటీషన్ పెరగడంతో ప్యాకేజీలను తీసుకొచ్చారు. చాలాకాలం తరువాత నెట్ ఫ్లిక్స్ సంస్థ మళ్లీ ఫ్రీ స్ట్రీమింగ్ ను తీసుకొచ్చింది. సినిమాలు, సీరీస్, సీరియళ్లు కూడా ఓటిటి ఫ్లాట్ ఫామ్ ద్వారా రిలీజ్ అవుతుండటంతో కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ ను తీసుకొచ్చింది. గత వారంలో రెండు రోజులపాటు నెట్ ఫ్లిక్స్ సంస్థ స్ట్రీమ్ ఫెస్ట్ ను తీసుకొచ్చింది. ఇది విజయవంతం కావడంతో మరోసారి అఫర్ ను ప్రకటించింది. డిసెంబర్ 9 వ తేదీ నుంచి డిసెంబర్ 11 వ తేదీ వరకు రెండు రోజులపాటు నెట్ ఫ్లిక్స్ ఫ్రీ స్ట్రీమింగ్ ద్వారా సినిమాలు చూసుకోవచ్చు. అయితే, హైక్వాలిటీ వీడియోలకు అప్ గ్రేడ్ కావాలంటే తప్పనిసరిగా మెంబర్ షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉంటే మరోవైపు మిగతా సంస్ధలు కూడా దీని బాటలోనే నడిచే అవకాశాలు ఉన్నట్లు నెటిజన్లు చెబుతున్నారు.