జాను టీజర్: ‘నిన్ను ఎక్కడ వదిలేశానో.. అక్కడే ఉన్నాను’
యంగ్ హీరో శర్వానంద్, సమంత కలిసి నటిస్తోన్న ‘జాను’ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. రెండు రోజుల క్రితమే ఈ సినిమా.. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. తమిళ హిట్ ’96’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. టీజర్ టాక్: తమిళంలో ’96’ సినిమా చూసిన వారికి ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలోని ప్రతీ సీన్‌ని ‘జాను’ టీజర్‌లో దించేశారనే చెప్పాలి. స్కూల్లో […]
యంగ్ హీరో శర్వానంద్, సమంత కలిసి నటిస్తోన్న ‘జాను’ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. రెండు రోజుల క్రితమే ఈ సినిమా.. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. తమిళ హిట్ ’96’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
టీజర్ టాక్: తమిళంలో ’96’ సినిమా చూసిన వారికి ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలోని ప్రతీ సీన్‌ని ‘జాను’ టీజర్‌లో దించేశారనే చెప్పాలి. స్కూల్లో ఇష్టాల దగ్గర నుంచి.. మళ్లీ వారు కలిసే సీన్ వరకూ చిన్న చిన్న బిట్స్ రూపంలో టీజర్‌ని చూపించారు. కాగా.. టీజర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అలరించింది. విజువల్స్ ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. మధ్య మధ్యలో డైలాగ్స్ సూపర్‌గా అనిపించాయి.
ఇక ఇందులో శర్వా, సమంతల యాక్టింగ్ మనసును హత్తుకునేలా ఉంది. అయితే.. ఈ జోడీ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్‌ని క్రియేట్ చేస్తుందో తెలుసుకోవాలంటే.. సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ ఆగాలి. కాగా.. ఈ చిత్రానికి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేసేయండి.