దీపావళి పటాసుల విక్రయంపై రాజస్థాన్ కీలక నిర్ణయం

దీపావళి పటాసుల విక్రయంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సోమవారం సంచలన ప్రకటన చేశారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బాణసంచా విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు.

  • Balaraju Goud
  • Publish Date - 6:29 pm, Mon, 2 November 20
దీపావళి పటాసుల విక్రయంపై రాజస్థాన్ కీలక నిర్ణయం

దీపావళి పటాసుల విక్రయంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సోమవారం సంచలన ప్రకటన చేశారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బాణసంచా విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చినపుడు వచ్చే పొగ కాలుష్యం కారణంగా కొవిడ్ రోగులతోపాటు గుండె, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి దీపావళిని ప్రతి ఒక్కరు సాదాసీదాగా దీపాలను మాత్రమే వెలిగించి ఎవరి ఇళ్లల్లో వారే నిర్వహించుకోవాలని సీఎం సూచించారు. ప్రజలు బాణసంచా కాల్చకుండా ఉండాలని సీఎం అశోక్ గెహ్లాట్ కోరారు.

పటాసుల విక్రయానికి లైసెన్సుల జారీని తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులకు ఈ మేరకు పలు సూచనలు చేశారు. జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా వైరస్ రెండో విడత ప్రారంభమైందని, దీనివల్ల పలు దేశాల్లో మరోసారి లాక్ డౌన్ విధించాల్సి వచ్చిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులు మన రాజస్థాన్ రాష్ట్రంలో ఏర్పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. రెడ్ లైట్ల వద్ద ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేసి వాయు కాలుష్యాన్ని కాపాడాలని సీఎం గెహ్లాట్ వాహన డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం నిర్దేశించిన ప్రమాణాలను ఉల్లంఘించే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం ఆశోక్ గెహ్లాట్.

ఇదీ చదవండిః ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది రాజ్యసభ సభ్యుల ఏకగ్రీవం